Lord Ram : భారత్‌లో శ్రీరాముని పేరుతో 343 రైల్వే స్టేషన్లు..
ఈ నెల 22న అయోధ్య రాములోరి విగ్రహ ప్రతిష్టాపనకు స్వరం సిద్ధమయ్యింది. ఈ మహత్తర కార్యానికి మూడు రోజులు మాత్రమే ఉంది. ఈ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించేందుకు దేశంలోని భారతీయులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంతటి మహోజ్వల ఘట్టంలో భారతీయ రైల్వేశాఖ కీలక పాత్ర పోషించనున్నది. భారతదేశంలో శ్రీరాముని పేరుతో 343 రైల్వేస్టేషన్లు ఉన్నాయి.
ఇలాంటి తరుణంలో భారత్‌లోని ఈ రైల్వేస్టేషన్లను జనవరి 22న ఎంతో అందంగా ముస్తాబు చేయనున్నారు. ఈ రైల్వేస్టేషన్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక, ఈ మహత్త కార్యక్రమానికి శ్రీరాముని పేరుతో ఉన్న ఈ రైల్వేస్టేషన్లను ఎంతో అందంగా ముస్తాబు చేయాలని, విద్యుత్ దీపాలతో అలంకరించాలని రైల్వేశాఖ నిర్ణయంతీసుకుంది.

శ్రీరాముని పేరుతో ఉన్న రైల్వేస్టేషన్లు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎపీలో మొత్తం 55 రైల్వేస్టేషన్లకు శ్రీరాముని పేరు ఉండగా, తరువాతి స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 54 రైల్వేస్టేషన్లున్నాయి. ఇక, మూడో స్థానంలో బీహార్ రాష్ట్రం ఉన్నది. ఇక తెలంగాణ రాష్ట్రంలో శ్రీరాముని పేరుతో గల రైల్వేస్టేషన్ల పేర్లని ఓసారి చూద్దాం.
రామగుండం, రామకృష్ణాపురం, రామన్నపేట, ఆంధ్రప్రదేశ్‌లో రామచంద్రాపురం, రామాపురం, కర్ణాటకలో రామగిరి, రామనగరం,ఇక ఉత్తరప్రదేశ్‌లో రామచంద్రాపూర్, రామ్‌గంజ్, రామ్‌చౌరా రోడ్ ఇలా ఊరు పేరు చివర, ముందు శ్రీరాముని పేర్లు జోడించి ఉన్నాయి. ఇలాంటి రైల్వేస్టేషన్లను జనవరి 22న రైల్వేశాఖ ఎంతో అందంగా సుందరీకరించాలని నిర్ణయిం తీసుకుంది.

జనవరి 22 తర్వాత అయోధ్యకు వెయ్యి ప్రత్యేక రైళ్లు...
జనవరి 22న జరిగే అయోధ్య మహోజ్వల ఘట్టం సందర్భంగా అయోధ్య రామాలయాన్ని వీక్షించాలనే భక్తుల కోసం ఆస్తా స్పెషల్ పేరుతో దేశ నలు మూలల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. అనంతరం వంద రోజులపాటు అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తు కోసం వెయ్యి రైళ్లను నడపాలని ముందుగానే రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే వాటి ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది. ఈ స్పెషల్ రైళ్లలో రానుపోను టికెట్లను ఒకేసారి బుక్‌చేసుకోవాలి.












Click it and Unblock the Notifications