శివుడు కులం ఏంటో తెలుసా.. ఈ మంత్రి ఆధారాలతో సహా చెప్పాడు
బీహార్ : ఇప్పటివరకు కులజాఢ్యం ఒక్క మనుషులకే పరిమితమైందని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ కుల కంపును దేవుళ్లకు కూడా అంటించేస్తున్నారు కొందరు నాయకులు. ఫలానా దేవుడు మా కులం వాడంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా బీహార్ మాజీ మంత్రి భగవంతుడికి కులం రంగు అద్దారు.
బీహార్ మంత్రి బ్రిజ్ కిషోర్ బింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివుడు తమ కులంకు చెందిన వాడంటూ వ్యాఖ్యానించారు. శివుడు బింద్ కులంకు చెందిన దేవుడని చెప్పారు. అంతేకాదు హిందీలో రాసి ఉన్న కొన్ని వాక్యాలను రుజువుగా పొందుపర్చారు. కృష్ణ పరమాత్ముడు యాదవ కులంకు చెందిన వాడైతే, శ్రీరాముడు క్షత్రియ కులంకు చెందిన వాడు అయినప్పుడు శివుడు బింద్ కులంకు ఎందుకు చెంది ఉండకూడదని ప్రశ్నించారు. మన చరిత్ర చాలా పురాతనమైనదని చెప్పిన మంత్రి బ్రిజ్ కిషోర్ బింద్... శివ పురాణంలో శివుడి యొక్క కులం గురించి ప్రస్తావించారని చెప్పారు. శివుడు బింద్ కులంకు చెందిన వాడని అందులో స్పష్టంగా ఉన్నట్లు చెప్పారు.

ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మొత్తం బీహార్ జనాభాలో కేవలం 2శాతం ఉన్న ఓ కులానికి చెందిన వారు 14శాతం ఉన్న మరో కులం వారిపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని అన్నారు. నోనియా -బింద్- బేల్దార్ మహాసంఘ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి బ్రిజ్ కిషోర్ బింద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్, ఆరోగ్యశాఖ మంత్రి మంగల్ పాండేలు కూడా పాల్గొన్నారు. గతేడాది ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా భగవంతుడికి కులం అంటగట్టి విమర్శలపాలయ్యారు. హనుమంతుడు దళితుడంటూ వ్యాఖ్యానించారు. యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై మనస్తాపం చెందిన రాజస్థాన్ సర్వ్ బ్రాహ్మిణ్ మహాసభ అధ్యక్షుడు సురేష్ మిశ్రా నోటీసులు జారీ చేశారు. కేవలం రాజకీయంగా లబ్ది పొందేందుకు హనుమంతుడికి కులం అంటగట్టారని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications