వివాదం: స్వామి నారాయణుడికి ఆర్ఎస్ఎస్ యూనిఫాం!
సూరత్: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణంలో కొలువైన ప్రసిద్ధ స్వామి నారాయణ్ దేవాలయం ఇప్పుడు దేశంలో ప్రముఖ వార్తాంశంగా మారిపోయింది. ఆ దేవాలయంలోని స్వామినారాయణ్ విగ్రహానికి ఏకంగా ఆర్‌ఎస్‌ఎస్(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) యూనిఫాం వేయడం ఇందుకు కారణంగా మారింది.
ఆలయంలోని స్వామినారాయణ్ విగ్రహానికి ఖాకీ నెక్కరు వేసి, దానిపై తెలుపు రంగు చొక్కా.. తలకి నల్లని క్యాప్.. నల్ల బూట్లు వేసి ఉంచారు. అంతేకాకుండా ఈ విగ్రహం ఒక చేతిలో జాతీయ జెండా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పలువురు విమర్శలు చేస్తున్నారు.
దీనిపై ఆలయ నిర్వహణాధికారి మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం ఓ భక్తుడు ఈ దుస్తులను ఆలయానికి కానుకగా సమర్పించారని తెలిపారు. దేవుడ్ని వివిధ రూపాల్లో అలంకరించడం సాధారణమేనని, అందులో భాగంగానే ఆర్‌ఎస్‌ఎస్ యూనిఫాంను వేశామని, ఇందులో ఎటువంటి ఎజెండా లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇది వివాదాస్పదంగా మారుతుందన్న ఆలోచన తమకు రాలేదని ఆలయ నిర్వాహకుడు విశ్వప్రకాశ్‌జీ వెల్లడించారు. దీనిపై సీనియర్ కాంగ్రెస్ నేత శంకర్ సింహ్ వాఘేలా తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేవుడి విగ్రహానికి ఖాకీ నిక్కరు వేసి ఏం నిరూపించాలనుకుంటున్నారు? ప్రశ్నించారు.
ఈరోజు దేవుడికి ఆర్‌ఎస్‌ఎస్ యూనిఫాం వేశారు.. రేపు బిజెపి యూనిఫాం వేస్తారా? అని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదు అని అన్నారు. దీనిపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు విజయ్ రుపానీ మాట్లాడుతూ.. విషయం తెలిసి తానూ ఆశ్చర్యపోయానని, అలా జరిగివుండకూడదని అన్నారు. ఇలాంటి వాటిని తాను అంగీకరించనని చెప్పారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications