Illegal affair: అత్తా, అల్లుడి అక్రమ సంబంధం, లేచిపోయి పెళ్లి, ఈ పెద్దోళ్లు ఉన్నారే, మా ప్రేమను ?

ముజఫర్ నగర్: అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న అత్త కొన్ని సంవత్సరాలు అతనితో ఎంజాయ్ చేసింది. అత్తా, అల్లుడి అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, పెద్దలు ఇద్దరికి చివాట్లు పెట్టారు. అత్తాకు 50 ఏళ్లు, అల్లుడికి 25 ఏళ్లు కావడంతో వీరి లవ్ స్టోరీ తెలుసుకున్న అందరూ ముక్కున వేలు వేసుకున్నారు. ఇక లాభం లేదని డిసైడ్ అయిన అత్తా, అల్లుడు ఊరు వదిలి పరారైనారు. 10 నెలల తరువాత సొంత ఊరికి వచ్చిన అత్తా, అల్లుడు మేము పెళ్లి చేసుకున్నాము, ఇక ముందు కలిసి కాపురం చేస్తామని, ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, ఈ పెద్దోళ్లు మా ప్రేమను అర్థం చేసుకోవడం లేదు అంటూ ఈ ప్రేమపావురాలు ఊరందరి ముందు సినిమా డైలాగులు చెప్పారు. షాక్ అయిన బంధువులు, ఊరిపెద్దలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు కథ మొదలైయ్యింది.

 అత్తకు 50 ఏళ్లు, అల్లుడికి 25 ఏళ్లు

అత్తకు 50 ఏళ్లు, అల్లుడికి 25 ఏళ్లు

ఉత్తరప్రదేశ్ లో అక్కడక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాము. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలోని మధుభర్ గ్రామంలో 50 ఏళ్ల చిత్రా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఇదే గ్రామంలో రంజిత్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చిత్రాకు రంజిత్ అల్లుడు అవుతాడు.

 అత్తా, అల్లుడి అక్రమ సంబంధం

అత్తా, అల్లుడి అక్రమ సంబంధం

చిత్రా వరుసకు అల్లుడు అయ్యే రంజిత్ మీద మోజుపడింది. 50 ఏళ్లు వయసు వచ్చినా చూడటానికి చిత్రా అందంగా ఉండటంతో రంజిత్ కూడా ఆమెతో రాసుకుని పూసుకుని తిరిగాడు. అల్లుడు రంజిత్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న అత్త చిత్రా కొన్ని సంవత్సరాలు అతనితో ఎంజాయ్ చేసింది. అత్తా, అల్లుడి అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, పెద్దలు ఇద్దరికి చివాట్లు పెట్టినా వారు మాత్రం ఏమాత్రం మారలేదు.

 జెండా ఎత్తేసిన ప్రేమపావురాలు

జెండా ఎత్తేసిన ప్రేమపావురాలు

చిత్రా, రంజిత్ అక్రమ సంబంధం వ్యవహారం కుటుంబ సభ్యులకు, బంధువులకు, ఊరి వాళ్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారికి తెలిసిపోవడంతో హాట్ టాపిక్ అయ్యింది. అత్తా చిత్రాకు 50 ఏళ్లు, అల్లుడు రంజిత్ కు 25 ఏళ్లు కావడంతో వీరి లవ్ స్టోరీ తెలుసుకున్న అందరూ ముక్కున వేలువేసుకున్నారు. ఇక లాభం లేదని డిసైడ్ అయిన అత్తా చిత్రా, అల్లుడు రంజిత్ 10 నెలల క్రితం ఊరు వదిలి పరారైనారు.

 కామానికి కళ్లులేవు అంటే ఇదేనేమో ?

కామానికి కళ్లులేవు అంటే ఇదేనేమో ?

తన కంటే వయసులో అర్దం వయసు ఉన్న రంజిత్ మోజులో పడిపోయిన చిత్రాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. చిత్రా పిల్లలకు ఇప్పుడు పిల్లలు పట్టారు. అంటే చిత్రా ఇప్పుడు అమ్మమ్మ అన్నమాట. కామంతో రగిలిపోతున్న చిత్రా పరువు, మర్యాదను గాలికి వదిలేసి అల్లుడు రంజిత్ తో కలిసి పారిపోయి 10 నెలలు అతనితో ఎంజాయ్ చేస్తూ కామం తీర్చుకుని జల్సా చేసింది.

 మేము పెళ్లి చేసుకున్నాము..... ఆశీర్వదించండి

మేము పెళ్లి చేసుకున్నాము..... ఆశీర్వదించండి

10 నెలల తరువాత సొంత ఊరికి వచ్చిన అత్తా చిత్రా, అల్లుడు రంజిత్ మేము పెళ్లి చేసుకున్నాము, ఇక ముందు కలిసి కాపురం చేస్తామని, ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదని ఈ ప్రేమపావురాలు ఊరందరికి చెప్పారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, ఊరి పెద్దలు మండిపడ్డారు. వీళ్లను ఇలాగే వదిలేస్తే మిగిలినవాళ్లు చెడిపోతారని ఊరి పెద్దలు భయపడ్డారు.

 మామలు ఎంట్రీతో సీన్ రివర్స్

మామలు ఎంట్రీతో సీన్ రివర్స్

చిత్రా, ఆమె అల్లుడు రంజిత్ వ్యవహారంతో షాక్ అయిన బంధువులు, ఊరిపెద్దలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మధుభర్ గ్రామం చేరుకుని ఆరా తియ్యడంతో అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. చిత్రా, రంజిత్ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఊరందరు ఆరోపించడంతో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

 ఆ సెక్షన్ కింద కేసు నమోదు

ఆ సెక్షన్ కింద కేసు నమోదు

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CRPC) సెక్షన్ 151 కింద రంజిత్, అతని అత్త చిత్రా మీద కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసు అధికారి జితేందర్ టెవాటియా చెప్పారని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు, స్థానికులు ఇలాంటి కేసులు పెట్టిన సమయంలో ఇలాంటి సెక్షన్ కింద అరెస్టు చేసే సమయంలో సంబంధిత వ్యక్తులకు సమన్లు, నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చెయ్యడానికి అవకాశం ఉంటుందని పోలీసు అధికారి జితేందర్ టెవాటియా అంటున్నారు. మొత్తం మీద ప్రేమపక్షులు అత్త చిత్రా, అల్లుడు రంజిత్ ఊరి పెద్దల దెబ్బతో ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+