Daughter: తక్కువ కులం వాడితో కూతురి లవ్ స్టోరీ, చంపేసి తిరుమల వెళ్లి దర్శనం చేసుకున్న తండ్రి !

బెంగళూరు/బళ్లారి: దంపతులు వారి కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచారు. కూతురి పేరుతో బ్యాంక్ లో రూ. 20 లక్షలు డిపాజిట్ చేశారు. కూతురు ఏం కావాలంటే అది తీసిచ్చారు. కాలేజ్ లో చదివే సమయంలో ఆ అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమించింది. కూతురి మ్యాటర్ ఆమె కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. తన కూతురు తక్కువ కులం అబ్బాయిని ప్రేమించందని తెలుసుకున్న తండ్రి రగిలిపోయాడు. నీ ప్రియుడిని మరిచిపోవాలని కుటుంబ సభ్యులు చెప్పినా ఆ అమ్మాయి ఏమాత్రం పట్టించుకోలేదు. తండ్రి అతని కూతురిని బైక్ లో పిలుచుకుని సినిమాకు వెళ్లి మాయం అయ్యారు. రెండు రోజుల తరువాత కూతురు కాలువలో శవమై కనిపించింది.

కూతురు అంటే చాలా ప్రేమ

కూతురు అంటే చాలా ప్రేమ

కర్ణాటకలోని బళ్లారి జిల్లాలోని కుడతి పట్టణంలోని బడ్డ జంగమ కాలనీలో ఓంకార గౌడ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఓంకార గౌడ దంపతులకు ఓ కూతురు ఉంది. ఓంకార గౌడ దంపతులు వారి కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచారు. ఓంకార గౌడ అతని కూతురి పేరుతో బ్యాంక్ లో రూ. 20 లక్షలు డిపాజిట్ చేశాడు.

ప్రేమలో పడిన యువతి

ప్రేమలో పడిన యువతి

ఓంకార గౌడ అతని కూతురు ఏం కావాలంటే అది తీసిచ్చాడు. కాలేజ్ లో చదివే సమయంలో ఓంకార గౌడ కూతురు ఓ అబ్బాయిని ప్రేమించింది. ప్రేమికులు అక్కడా ఇక్కడా తిరిగేశారు. కూతురి మ్యాటర్ ఆమె కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. తన కూతురు తక్కువ కులం అబ్బాయిని ప్రేమించందని తెలుసుకున్న ఓంకార గౌడ రగిలిపోయాడు.

పద్దతి మార్చుకోని కూతురు

పద్దతి మార్చుకోని కూతురు

నీ ప్రియుడిని మరిచిపోవాలని ఓంకార గౌడ, అతని కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చినా ఆ అమ్మాయి ఏమాత్రం పట్టించుకోలేదు. రహస్యంగా ప్రియుడిని కలుసుకున్న యువతి అతన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. కూతురు తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుంటే ఊరిలో తల ఎత్తుకుని తిరగలేనని ఓంకార గౌడ అందరి దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు.

సినిమా స్కెచ్ వేసిన ఓంకార గౌడ

సినిమా స్కెచ్ వేసిన ఓంకార గౌడ

అక్టోబర్ 31వ తేదీన ఓంకార గౌడ అతని కూతురికి సినిమా చూపిస్తానని ఇంటి దగ్గర నుంచి బైక్ లో పిలుచుకుని వెళ్లాడు. సినిమా థియేటర్ దగ్గరకు వెళ్లారు. అప్పటికే సినిమా ప్రారంభం అయిపోవడంతో అక్కడి నుంచి హోటల్ దగ్గరకు వెళ్లారు. కూతురికి ఇష్టమైన తిండి మొత్తం తీసిచ్చిన ఓంకార గౌడ అతను తిన్నాడు.

హత్యకు ముందు కూతురికి బంగారు నగలు తీసిచ్చాడు

హత్యకు ముందు కూతురికి బంగారు నగలు తీసిచ్చాడు

హోటల్ లో నుంచి నేరుగా జ్యువెలరీ షాపుకు కూతురిని పిలుచుకుని వెళ్లిన ఓంకార గౌడ ఆమెకు జత కమ్మలు, ఒక ఉంగరం తీసిచ్చాడు. అక్కడి నుంచి కూతుర్ని గుడికి పిలుచుకుని వెళ్లి అమ్మావారి దర్శనం చేయించారు. తరువాత ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. మార్గం మద్యలో బళ్లారి హెచ్ఎల్ సీ కాలువ దగ్గర బైక్ నిలిపిన ఓంకార గౌడ అతని కూతురితో ప్రియుడి విషయం గురించి మాట్లాడాడు.

కూతురిని చంపేసి తిరుమల వెళ్లి దేవుడి దర్శనం

కూతురిని చంపేసి తిరుమల వెళ్లి దేవుడి దర్శనం

తరువాత నువ్వు ఇక్కడే ఉండు నేను కొంతసేటి తరువాత వస్తానని చెప్పిన ఓంకార గౌడ వెళ్లిపోయాడు. గంట తరువాత చికటిలో వెనుక నుంచి వెళ్లిన ఓంకార గౌడ అతని కూతురిని హెచ్ఎల్ సీ కాలువలో తోసి హత్య చేశాడు. కూతురిని హత్య చేసిన ఓంకార గౌడ నేరుగా స్స్నేహితుడు భీమప్ప దగ్గర బైక్ ఇచ్చి అక్కడి నుంచి తిరుపతి, అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి దేవుడి దర్శనం చేసుకున్నాడు.

కూతురి బ్యాంక్ అకౌంట్ లో రూ. 20 లక్షలు మాయం

కూతురి బ్యాంక్ అకౌంట్ లో రూ. 20 లక్షలు మాయం

తిరుపతి నుంచి బళ్లారి వస్తున్న ఓంకార గౌడను కోప్పళ సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. ఓంకార గౌడ అతని కూతురిని హత్య చేసే సమయంలో భీమప్ప కూడా సహకరించాడని ఆరోపణలు ఉన్నాయి. కూతురి పేరుతో బ్యాంక్ లో ఉన్న రూ. 20 లక్షలు కొన్ని రోజుల క్రితం ఓంకార గౌడ అతని స్నేహితుడు భీమప్ప బ్యాంక్ అకౌంట్ కు బదిలి చేయించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నా కూతురిని నేను హత్య చేశానని ఓంకార గౌడ అంగీకరించాడని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+