వైరల్ వీడియో: ఇండిగో ఎఫెక్ట్.. ఈ టెకీ దంపతులు ఏం చేశారంటే..?

దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సర్వీసుల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాల్లో ఆందోళన పరిస్థితి నెలకొంది. నాలుగు రోజులుగా కొనసాగుతున్న సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దు కావడం దృష్ట్యా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో సర్వీసుల రద్దు కారణంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, వేడుకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ఓ టెకీ జంట తమ వివాహ రిసెప్షన్ ను ఆన్ లైన్ ద్వారా నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇండిగో సర్వీసుల రద్దు కారణంగా ఓ టెకీ జంట తమ వివాహ రిసెప్షన్ ను ఆన్ లైన్ వేదికగా నిర్వహించింది. విమానాలు రద్దు కావడంతో పెళ్లి తర్వాత రిసెప్షన్ కోసం అనుకున్న నగరానికి వారు సమయానికి చేరుకోలేక పోయారు. దాంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు వారికి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో.. ఈ టెకీ దంపతులు వర్చువల్ వేదికగా రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన 84 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. వివిధ రాష్ట్రాల నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రావాల్సిన 71 ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండిగో సిబ్బందిని ప్రయాణికులు నిలదీస్తున్నారు. వారి నుంచి స్పష్టత రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళనలో ఉన్నారు. దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. దిల్లీ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 12 గంటల పాటు నీరు, భోజనం కూడా అందని పరిస్థితి నెలకొంది.

Love in the Time of Cancelled Flights Hyderabad Techie Couple Hosts Epic Zoom Wedding Reception

ఇదిలాఉంటే చెన్నై ఎయిర్ పోర్టు, విశాఖ ఎయిర్ పోర్టులు.. ఆర్టీసీ బస్టాండ్ల మాదిరి తలపిస్తున్నాయి. ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లో ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు ఆగ్రహంతో అరుస్తూ, నినాదాలు చేస్తూ సిబ్బందిని ప్రశ్నిస్తూ కనిపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఇండిగో సర్వీసుల రద్దుకు గల కారణాలను చూస్తే.. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ లో వచ్చిన మార్పులు, సిబ్బంది కొరత, క్రూ ప్లానింగ్ లో పలు లోపాలు.. తదితర కారణాలుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+