నఖ్వీ, షానవాజ్‌లకు హిందూ భార్యలు: అజంఖాన్
బరేలి: సమాజ్‌వాది పార్టీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంత్రి అజాంఖాన్ భారతీయ జనతా పార్టీ నాయకులపై మండిపడ్డారు. లవ్ జిహాద్ అంటే ఏమిటో? హిందూ యువతులను వివాహం చేసుకున్న బిజెపి నాయకులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, షానవాజ్ హుస్సేన్‌లను అడగాలని సూచించారు.
లవ్, జిహాద్ అనేవి రెండూ పవిత్రమైనవని చెప్పారు. వాటిపై చేసేవి చిల్లర రాజకీయాలేనని అన్నారు. లవ్ జిహాద్ అంశంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. ఇద్దరు వేర్వేరు మతాలకు చెందిన వ్యక్తులు వివాహం చేసుకోవడంలో తప్పులేదని అన్నారు.

ముస్లిం మతానికి చెందిన బిజెపి నాయకులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, షానవాజ్ హుస్సేన్‌లు హిందువులైన మహిళలను వివాహం చేసుకున్నారని.. లవ్ జిహాద్ అంటే ఏమిటో వారినే అడగాలని అన్నారు. వారినే విచారిస్తే సరైన వివరాలు తెలుస్తాయని చెప్పారు.
‘లవ్ జిహాద్' అంటే హిందువులైన యువతులకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్న తర్వాత వారిని ముస్లిం యువకులు తమ మతంలోకి మార్చడమేనని యోగి ఆదిత్యానాథ్ లాంటి నాయకులు చెప్పారు.
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications