షాక్: వీహెచ్‌పీ మేగ్జిన్ కవర్ పేజీ పైన కరీనా కపూర్ మార్ఫింగ్ ఫోటో

న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్‌కు (వీహెచ్‌పీ) చెందిన ఓ మేగజిన్ కవర్ పేజీ పైన బాలీవుడ్ నటి కరీనా కపూర్ మార్ఫింగ్ ఇమేజ్ కలకలం సృష్టిస్తోంది. లవ్ జిహాద్, మత మార్పిళ్ల పైన వీహెచ్‌పీ నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా తమ మేగజిన్ అయిన 'హిమాలయ వాహిని' కవర్ పేజీ పైన కరీనా ఫోటోను మార్ఫింగ్ చేసి వేసినట్లుగా చెబుతున్నారు.

అందులో సగం ముఖం పైన ముసుగు కప్పి ఉంది. లవ్ జిహాద్, ముస్లీం వ్యక్తిని పెళ్లి చేసుకున్న హిందూ మహిళలను తిరిగి మతం మార్చడం వంటి సమస్యల పరిష్కారం అని ఫోటో కింద పేర్కొంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను కరీనా వివాహం చేసుకుంది. ఆమె ఓ సెలబ్రిటీ.

Love Jihad: VHP magazine morphs Kareena Kapoor Khan's photo on cover

ఈ విషయంలో ఆమెను కొంతమంది కూడా అనుసరించవచ్చని, అందుకే ఉదాహరణగా ఆమెను చూపినట్లు భావిస్తున్నారు. కాగా, గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో సైఫ్ అలీఖాన్ మాట్లాడుతూ.. లవ్ జిహాద్ పైన తనకు నమ్మకం లేదని చెప్పాడు. వీహెచ్‌పీ పత్రిక పైన కరీనా ఫోటో రావడం ఓ విధంగా ఆశ్చర్యకరమేనని చెప్పవచ్చు.

కాగా, పదహారు మంది హిందూ మహిళల్ని ముస్లీం యువకులను హిందూ యువకులుగా చెప్పుకొని పెళ్లి చేసుకున్నారని, ఆ మహిళలను తిరిగి హిందుత్వంలోకి వచ్చేందుకు తమను కలిశారని, ఇప్పటికే తాము ఇద్దర్ని తిరిగి హిందుత్వంలోకి తెచ్చామని, ఒకరు మరో పెళ్లి చేసుకున్నారని వీహెచ్‌పీ నేత ఒకరు చెప్పినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+