Love marriage: ఒకే కంపెనీలో ఉద్యోగం, టెక్కీ మొగుడు టార్చర్ ?, లేడీ టెక్కీ ఆత్మహత్య, డెత్ నోట్ లో !
బెంగళూరు: ఐటీ హబ్ లో సాఫ్ట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తున్న యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులు అవునన్నా, కాదన్నా పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు ముందే డిసైడ్ అయ్యారు. నాలుగు సంవత్సరాల క్రితం సంతోషంగా వివాహం చేసుకున్న దంపతులు కాపురం పెట్టారు. తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. స్నేహితులు దంపతులకు మద్య రాజీ చేస్తూ వచ్చారని సమాచారం. అయితే జీవితంపై విరక్తి పెంచుకున్న లేడీ టెక్కీ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన భర్త తనకు టార్చర్ పెట్టాడని, ప్రేమించి పెళ్లి చేసుకున్న నా జీవితం నాశనం అయ్యిందని డెత్ నోట్ రాసిపెట్టిన లేడీ టెక్కి ఆత్మహత్య చేసుకుందని వెలుగు చూడటం కలకలం రేపింది.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు
బెంగళూరులోని ఓ ప్రముఖ ప్రైవేట్ సాఫ్ట్ కంపెనీలో సంగీతా (26) అనే యువతి, వినయ్ అనే యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగంలో చేరారు. ఐదు సంవత్సరాల క్రితం సంగీతాకు, వినయ్ కు పరిచయం అయ్యింది. ప్రతిరోజూ కలుస్తున్న వినయ్, సంగీతా మనసు విప్పిమాట్లాడుకుని మంచి స్నేహితులు అయ్యారు.

టెక్కీల లవ్ మ్యారేజ్
బెంగళూరులోని సాఫ్ట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తున్న సంగీతా, వినయ్ ల పరిచయం ఒకరి మీద ఒకరికి ప్రేమగా మారింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు సంగీతా, వియన్ ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులు అవునన్నా, కాదన్నా పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు సంగీతా, వినయ్ ముందే డిసైడ్ అయ్యారు.

హ్యాపీలైఫ్.... ఎంజాయ్ చేశారు
నాలుగు సంవత్సరాల క్రితం సంతోషంగా వివాహం చేసుకున్న వినయ్, సంగీతా దంపతులు బెంగళూరులోని అమృతహళ్ళిలో ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. వివాహం చేసుకున్న సంగీతా, వినయ్ దంపతులు కొంతకాలం చాలా సంతోషంగా తిరుగుతూ ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా కాలం గడిపారు.

ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న లేడీ టెక్కి
రానురాను సంగీతా, వినయ్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. స్నేహితులు సంగీతా, వియన్ దంపతులకు మద్య రాజీ చేస్తూ వచ్చారని సమాచారం. అయితే జీవితంపై విరక్తి పెంచుకున్న లేడీ టెక్కీ సంగీతా శుక్రవారం భర్త వినయ్ బయటకు వెళ్లిపోయిన తరువాత ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

నా భర్త టార్చర్ పెట్టాడు
తన భర్త వినయ్ తనకు టార్చర్ పెట్టాడని, ప్రేమించి పెళ్లి చేసుకున్న నా జీవితం నాశనం అయ్యిందని ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసిపెట్టిన లేడీ టెక్కీ సంగీతా ఆత్మహత్య చేసుకుందని వెలుగు చూడటం కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు సంగీతా భర్త వినయ్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వినయ్, సంగీతా దంపతులు నివాసం ఉంటున్న ఇంటి చుట్టుపక్కల వాళ్లను విచారణ చేసిన పలీసులు వివరాలు సేకరించారు. ఆత్మహత్య చేసుకున్న లేడీ టెక్కీ సంగీతా స్నేహితులు, ఆమె కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని, వినయ్ ని విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications