లవ్, సెక్స్ ఔర్ ధోకా: ప్రేమ కోసం దొంగగా మారితే ప్రియురాలు ఏం చేసిందో తెలుసా?

జైపూర్: ఓ యువకుడు ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. తన ప్రేమ కోసం చివరికి దొంగగా కూడా మారాడు. అయితే అతడి ప్రియురాలు మాత్రం అతడికి హ్యాండ్ ఇచ్చింది. మరో యువకుడితో వెళ్లిపోయింది.

సినిమాను తలపిస్తున్న ఈ కథ.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన రమేష్(22) అనే యువకుడిది. ఏడాది క్రితం రమేష్ ఓ అమ్మాయితో ప్రేమలో పడి ఆమెను తీసుకుని పారిపోయాడు.

Love, 'sex' and dhoka: Rajasthan man's girlfriend elopes even after he turns a thief for her

కొన్ని రోజుల తరువాత ఆ అమ్మాయిని తీసుకుని తిరిగి తన స్వస్థలానికి వచ్చాడు. అతడి నిర్వాకంపై అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆ అమ్మాయి తరపు బంధువులు.. రమేష్ తిరిగి వచ్చాడని తెలియగానే గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేశారు.

దీంతో గ్రామ పంచాయతీ విచారణ జరిపి, ఆ అమ్మాయి కుటుంబానికి రమేష్ రూ.40 వేలు జరిమానా కింద చెల్లించాలని, ఆ తరువాతే అతడు తాను ప్రేమించిన అమ్మాయితో కలిసి జీవించాలని తీర్పునిచ్చింది.

దీంతో ఆ డబ్బు సంపాదించడం కోసం రమేష్ దొంగగా మారాడు. మరో ఇద్దరితో జతకలిసి మోటార్ బైక్‌లు దొంగతనం చేయడం ప్రారంభించాడు. అలా దొంగతనాలతో సంపాదించిన డబ్బుతో జరిమానా చెల్లించేశాడు.

ఇక తాను ప్రియురాలితో కలిసి జీవించాలనుకున్నాడు. అయితే ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది. ఈలోగానే ఆ అమ్మాయి మరో వ్యక్తితో వెళ్లిపోయింది. దీంతో రమేష్ నిర్ఘాంతపోయాడు. అయితే అతడి కథ ఇంతటితో ముగియలేదు.

గత శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తోన్న రమేష్, అతని ఇద్దరు సహచరులను పోలీసులు చెక్‌పోస్టు వద్ద అడ్డగించారు. పోలీసులు రమేష్ ను ప్రశ్నించగా తన కథనంతటిని వారికి వివరించాడు. గత కొన్ని నెలలుగా 50 మోటార్ బైక్‌లు దొంగిలించినట్లు చెప్పాడు.

దీంతో ఉదయ్‌పూర్‌లోని హీరాన్మాగిరి పోలీసుస్టేషన్‌కు చెందిన ఎస్సై సంజీవ్‌ రమేష్, అతడి ఇద్దరు సహచరులను అదుపులోకి తీసుకున్నారు. ప్రేమించిన అమ్మాయితో కలిసి జీవించడం కోసం దొంగతనాలకు పాల్పడిన రమేష్ చివరికి పోలీసు కస్టడీలో ఊచలు లెక్కపెడుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+