Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Love story: రేయ్ నేను యూట్యూబ్ హీరో, బొక్కలేరా, లవర్ అన్న హత్య, 9 లక్షల మంది ఫాలోవర్స్!

నోయిడా/ న్యూఢిల్లీ/ లక్నో: బైక్ స్టంట్ లతో సుమారు 9 లక్షల మంది వీక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో హీరో అయిన యువకుడికి గ్రహాలు అనుకూలించపోవడంతో జైలుపాలైనాడు. రేయ్ నేను నీ లవర్ అన్నను, నాకే ఎదురు చెబుతావా ? అంటూ ఓ యువకుడు బైక్ స్టంట్ బాయ్ ను ప్రశ్నించాడు. నువ్వు నా లవర్ అన్న అయితే ఏందిరా బొక్క అంటూ పక్కాప్లాన్ తో చంపేశాడు. ప్రమాదంలో యువకుడు మరణించాడని సినిమా ట్రిక్కులు చేసిన యూట్యూబర్ కు టైమ్ బాగా లేకపోవడంతో పోలీసులు అరెస్టు చేసి ఒక్క తన్నుతన్నితే ఎగిరి జైల్లో పడ్డాడు.

బైక్ స్టంటర్....... 9 లక్షల మంది ఫాలోవర్స్

బైక్ స్టంటర్....... 9 లక్షల మంది ఫాలోవర్స్

నిజాముల్ ఖాన్ అనే పేరు యూట్యూబ్ ఫాలో అవుతున్న వారికి కొత్తగా పరిచయం చెయ్యనవసరం లేదు. తన బైక్ స్టంట్ లతో అందర్ని ఔరా అనిపిస్తున్న నిజాముల్ ఖాన్ ఇప్పటి వరకు యూట్యూబ్ లో 9 మిలియన్ ( 9 లక్షల మంది) పైగా వీక్షకులను ఆకట్టుకున్నాడు. యూట్యూబర్ గా, బైక్ స్టంటర్ గా నిజాముల్ ఖాన్ తక్కువ కాలంలోనే చాలా ఫేమస్ అయిపోయాడు.

ప్రియురాలితో ఎంజాయ్

ప్రియురాలితో ఎంజాయ్

కమల్ శర్మా (26) అనే యువకుడి చెల్లిని యూట్యూబర్ నిజాముల్ ఖాన్ ప్రేమించాడని తెలిసింది. రియల్ హీరోలాగా రోడ్డు మీద బైక్ లో స్టంట్ లు చేస్తున్న నిజాముల్ ఖాన్ ఆ యువతిని వలలో వేసుకున్నాడు. ఇక తన హీరోయిజానికి పడిపోయిన యువతితో నిజాముల్ ఖాన్ కొన్ని నెలల నుంచి ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ ఎంజాయ్ చేశాడు.

రేయ్ నీ అంతు చూస్తా.... చూశావులే పోరా బొక్క

రేయ్ నీ అంతు చూస్తా.... చూశావులే పోరా బొక్క

తన చెల్లితో నిజాముల్ ఖాన్ తిరుగుతున్నాడని తెలుసుకున్న కమల్ శర్మా నేరుగా వెళ్లి అతన్ని ప్రశ్నించాడు. మన మతాలు వేరు, నువ్వు నా చెల్లితో తిరగడం మంచిది కాదు అంటూ కమల్ కూల్ గానే వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు నా లవర్ అన్న అయితే ఏందిరా బొక్క... ఇక్కడి నుంచి వెళ్లపో లేదంటే నీ అంతు చూస్తానని నిజాముల్ ఖాన్ ప్రియురాలి అన్న కమల్ శర్మాకు వార్నింగ్ ఇచ్చాడు.

ప్రియురాలి అన్నను కాల్చి చంపేశాడు

ప్రియురాలి అన్నను కాల్చి చంపేశాడు

తాను ప్రియురాలితో తిరగడానికి ఆమె అన్న కమల్ శర్మా అడ్డుగా ఉన్నాడని రగిలిపోయిన నిజాముల్ ఖాన్ అతన్ని చంపేయాలని ప్లాన్ వేశాడు. అక్టోబర్ 28వ తేదీన కమల్ శర్మాను మట్లాడాలని చెప్పి నోయిడాలోని ఇస్కాన్ దేవాలయం సమీపంలోకి పిలిపించారు. తరువాత కమల్ శర్మాతో గొడవ పెట్టుకుని అతన్ని చితకబాది అతి మొబైల్ ఫోన్ లాక్కొన్నారు. తరువాత నిజాముల్ ఖాన్ వెనుక నుంచి రివాల్వర్ తో కమల్ శర్మా గొంతులో కాల్చి చంపేశాడు.

 ఒక్క తన్ను తన్నితే జైల్లో పడిన యూట్యూబర్

ఒక్క తన్ను తన్నితే జైల్లో పడిన యూట్యూబర్

కమల్ శర్మాను హత్య చేసిన నిజాముల్ ఖాన్, అతని ఇద్దరు స్నేహితులు ఇస్కాన్ దేవాలయం సమీపంలో బైక్ ప్రమాదంలో అతను చనిపోయినట్లు చిత్రీకరించి అక్కడి నుంచి పరారైనారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. ఇదే సమయంలో కమల్ శర్మా గొంతులో బుల్లెట్ గాయాలైనాయని వైద్యులు పోస్టుమార్టుం నివేదిక ఇచ్చారు. యూట్యూబర్, బైక్ స్టంటర్ నిజాముల్ ఖాన్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తియ్యగా అతను అసలు విషయం అంగీకరించాడు. అంతే పోలీసులు యూట్యూబర్ నిజాముల్ ను ఒక్క తన్ను తన్నితే ఎగిరి జైల్లో పడ్డాడు. నిజాముల్ ఖాన్ ఇద్దరు స్నేహితులు పరారైనారని, వారి కోసం గాలిస్తున్నామని నోయిడా పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+