Love story: లవ్ మ్యారేజ్, పట్టపగలు షాపులో భర్త తల నరికి దారుణ హత్య, పెళ్లికూతురి బాయ్ ఫ్రెండ్ !
చెన్నై/ తుత్తుకూడి/కోవిల్ పట్టి: దగ్గర బంధువు టీవీ మెకానిక్ షాపులో ఓ యువకుడు పని చేస్తున్నాడు. ప్రతిరోజూ టీవీ షాపులోకి వెళ్లి ఎలక్ట్రానిక్ వస్తులు రిపేర్ చేస్తున్నాడు. సమీపంలోని టైపింగ్ ఇన్సిట్యూట్ కు వచ్చి వెలుతున్న యువతితో అతనికి రెండు సంవత్సరాల ముందు పరిచయం అయ్యింది. ఇద్దరి పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరి కులాలు వేరుకావడంతో పెళ్లికి పెద్దలు నిరాకరించారు. పెద్దలను ఎదిరించిన ప్రేమికులు రెండు నెలల క్రితం వివాహం చేసుకుని కొత్తగా అద్దె ఇంటిలో కాపురం పెట్టారు. టీవీ మెకానిక్ షాపులో ఓ యువకుడు ఎల్ ఈడీ టీవీ రిపేర్ కు ఇచ్చాడు. టీవీ తీసుకెళ్లడానికి వెళ్లిన యువకుడు టీవీ రిపేర్ చేసిన కొత్త పెళ్లి కొడుకు కళ్లల్లో కారం పొడి చల్లి కొడవలితో అతని తలను నరికి హత్య చేసి అక్కడి నుంచి చెక్కేశాడు. పెళ్లి కొడుకును పట్టపగలు దారుణంగా హత్య చేసిన యువకుడు పెళ్లి కూతురికి బాగా తెలుసని వెలుగు చూడటం కలకం రేపింది.

టీవీ మెకానిక్
తమిళనాడులోని తుత్తుకుడి జిల్లాలోని కోవిల్ పట్టి సమీపంలోని కుమారగిరి పుత్తూర్ ఏరియాలో నివాసం ఉంటున్న సుపురాజ్ అనే వ్యక్తికి సూర్య రాఘవన్ అలియాస్ సూర్యా (31) అనే కుమారుడు ఉన్నాడు. కోవిల్ పట్టిలోని ఎట్టయపురంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న బంధువు టీవీ మెకానిక్ షాపులో సూర్యా పని చేస్తున్నాడు. ప్రతిరోజూ సూర్యా టీవీ షాపులోకి వెళ్లి ఎలక్ట్రానిక్ వస్తులు రిపేర్ చేస్తున్నాడు.

కాలేజ్ అమ్మాయితో పరిచయం
బందరంతపుల గ్రామంలో మహాలక్ష్మి అనే యువతి నివాసం ఉంటున్నది. కోవిల్ పట్టిలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని టైపింగ్ ఇన్సిట్యూట్ కు వచ్చి వెలుతున్న మహాలక్ష్మికి, అదే ఏరియాలో టీవీ షాపులో పని చేస్తున్న సూర్యాకు రెండు సంవత్సరాల క్రితం పరిచయం అయ్యింది. తరువాత సూర్యా, మహాలక్ష్మి కలుసుకోవడం మొదలుపెట్టారు.

పొటుగాడి వన్ సైడ్ లవ్
చోళపురంలో నివాసం ఉంటున్న కన్నన్ కుమారుడు ఆనంద్ రాజ్ (22) అనే యువకుడు క్యాంటరింగ్ కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. మహాలక్ష్మి, ఆనంద్ రాజ్ ఒకే కులానికి చెందినవారు. మహాలక్ష్మిని వివాహం చేసుకోవాలని ఆనంద్ రాజ్ అనుకున్నాడు. మహాలక్ష్మిని ప్రేమించిన ఆనంద్ రాజ్ మనం పెళ్లి చేసుకుందామని ఆమెకు చెప్పాడు.

నో చెప్పిన అమ్మాయి
ఆనంద్ రాజ్ ను వివాహం చేసుకోవడానికి మహాలక్ష్మి అంగీకరించేదని తెలిసింది. నువ్వు నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రం కలిసి తిరిగాము ఇకచాలు అని మహాలక్ష్మి తేల్చి చెప్పిందని తెలిసింది. టైపింగ్ ఇన్సిట్యూట్ దగ్గర పరిచయం అయిన సూర్యాను హాలక్ష్మి ప్రేమించింది. మహాలక్ష్మి, సూర్యాల పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరి కులాలు వేరుకావడంతో పెళ్లికి పెద్దలు నిరాకరించారు.

రెండు నెలల ముందు పెళ్లి
పెద్దలను ఎదిరించిన ప్రేమికులు సూర్యా, మహాలక్ష్మి రెండు నెలల క్రితం స్నేహితుల సహాయంతో వివాహం చేసుకుని కోవిల్ పట్టిలో కొత్తగా అద్దె ఇంటిలో కాపురం పెట్టారు. మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్న సూర్యాను చంపేసి ఆమెను తరువాత పెళ్లి చేసుకోవాలని ఆనంద్ రాజ్ స్కెచ్ వేశాడు, సూర్యాను అతని షాపులోనే చంపేయాలని ఆనంద్ రాజ్ డిసైడ్ అయ్యాడు.

టీవీ రిపేర్ కు ఇచ్చాడు
సూర్యా పని చేస్తున్న టీవీ మెకానిక్ షాపులో ఆనందర్ రాజ్ ఓ ఎల్ ఈడీ టీవీ రిపేర్ కు ఇచ్చాడు. రెండు రోజుల తరువాత టీవీ రిపేర్ చేసి ఇస్తానని సూర్యా చెప్పాడు. టీవీ రిపేర్ పూర్తి అయ్యిందని సూర్యా ఆనంద్ రాజ్ కు ఫోన్ చేసి చెప్పాడు. ఆనంద్ రాజ్ ఓ బ్యాగ్ లో వేట కొడవలి, కారం పొడి ప్యాకెట్లు పెట్టుకుని టీవీ షాపు దగ్గరకు వెళ్లాడు.

ప్రియురాలి భర్తను షాపులోనే నరికేసిన వన్ సైడ్ లవర్
టీవీ తీసుకెళ్లడానికి వెళ్లిన ఆనంద్ రాజ్ టీవీ రిపేర్ చేసిన కొత్త పెళ్లి కొడుకు సూర్యా కళ్లల్లో కారం పొడి చల్లి నిమిషంలో వేట కొడవలితో అతని తల నరికి దారుణంగా చంపేసి అక్కడి నుంచి చెక్కేశాడు. పెళ్లి కొడుకు సూర్యా హత్యకు గురికావడం కలకలం రేపింది. పట్టపగలు దారుణంగా హత్య చేసిన ఆనంద్ రాజ్ పెళ్లి కూతురు మహాలక్ష్మికి బాగా తెలుసని వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు గాలించి ఆనంద్ రాజ్ ను అరెస్టు చెయ్యడం కలకం రేపింది. పోలీసులు మహాలక్ష్మిని కూడా విచారణ చేస్తున్నారని తెలిసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications