వాలెంటైన్స్ డే: ప్రియురాలి కోసం 2000నోట్లతో కారు, ఏం జరిగిందంటే..?

మంగళవారం ప్రేమికుల దినోత్సవం(వాలెంటైన్స్ డే) రోజు కావడంతో తన ప్రియురాలికి ఓ కొత్త కానుక ఇవ్వాలనుకున్నాడు ఓ యువకుడు. అనుకున్నదే తడవుగా తన కారును కొత్తగా విడుదలైన రూ. 2000 నోట్లతో పూర్తిగా అలంకరించేశాడు

ముంబై: ప్రేమికులు తమ ప్రేమను ప్రదర్శించేందుకు చిత్ర విచిత్రమైన, సాహసోపేతమైన కార్యాలలకు పూనుకుంటుంటారు. ఇక్కడ కూడా ఓ ప్రేమికుడు తన ప్రియురాలికి తన ప్రేమను తెలియజేసేందుకు వినూత్న ప్రదర్శన చేశాడు. అయితే చివరకు అతడు కటకటాలపాలు కావాల్సి వచ్చింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

మంగళవారం ప్రేమికుల దినోత్సవం(వాలెంటైన్స్ డే) రోజు కావడంతో తన ప్రియురాలికి ఓ కొత్త కానుక ఇవ్వాలనుకున్నాడు ఓ యువకుడు. అనుకున్నదే తడవుగా తన కారును కొత్తగా విడుదలైన రూ. 2000 నోట్లతో పూర్తిగా అలంకరించేశాడు.

Lover Decorates Car With Rs 2000 Notes As A Gift For His Girlfriend On Valentine's Day, Gets Arrested

ఇక తన ప్రియురాలిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేందుకు బయల్దేరాడు. అయితే, రోడ్డుపై వెలుతుండగా పోలీసులు చూసి.. అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో ఆ ప్రేమికుడు ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి.

అయితే, అరెస్ట్ చేసిన సదరు యువకుడి వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించలేదు. కాగా, పలువురు ప్రేమికులు అతనికి అండగా నిలుస్తండగా.. మరికొందరు ఇదేం వెర్రి అంటూ మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+