పెళ్లికి నో, సీన్ రివర్స్, యాసిడ్ దాడి చేసిన ప్రియురాలు

బాలియా: ప్రేమించడానికి నిరాకరించిన యువతుల మీద, పెళ్లి చేసుకునే విషయంలో గొడవలు జరగిన అనంతరంయువతుల మీద యాసిడ్ దాడులు జరిగిన సంఘటనలు మనం చాలనే చూశాం. నిత్యం దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి.

అయితే పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడి మీద ప్రియురాలు పగ తీర్చుకుంది. ఏకంగా అతని ముఖం, శరీరం మీద యాసిడ్ దాడి చేసిన యువతి అజ్ఞాతంలోకి వెళ్లి పోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోనిబాలియా సమీపంలో జరిగింది.

ఉత్తరప్రదేశ్ లోని బాలియా సమీపంలోని జామ్ గ్రామంలో రాజ్ కుమార్ పాల్ (20) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను ఒక యువతిని ప్రేమించాడు. అయితే ఆమెను పెళ్లి చేసుకోవడానికి రాజ్ కుమార్ నిరాకరించాడాని తెలిసింది.

 lover hurls acid on man near ballia in uttar pradesh

ఈ విషయంలో రాజ్ కుమార్, యువతి మద్య అనేక సార్లు గొడవ జరిగింది. సహనం కొల్పోయిన యువతి గురువారం రాత్రి ఒంటరిగా ఉన్న రాజ్ కుమార్ మీద యాసిడ్ దాడి చేసింది. ఈ దాడిలో అతని ముఖంతో సహ శరీరంలో అనేక చోట్ల గాయాలైనాయి.

యాసిడ్ దాడి చేసిన యువతి పరారైయ్యింది. రాజ్ కుమార్ కు బాలియాలో ప్రథమ చికిత్స చేయించి అనంతరం వారణాసికి తరలించామని పోలీసు అధికారి సందీప్ సింగ్ తెలిపారు. రాజ్ కుమార్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సందీప్ సింగ్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+