Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lover: ప్రియురాలిని చంపేసి మెడికల్ షాప్ లో నాలుగు రోజులు శవం పెట్టిన ప్రియుడు, అసలు మ్యాటర్ ?

రాయ్ పూర్/ఛత్తీస్ గఢ్: బాగా చదువుకున్న యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. కొంతకాలం తరువాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. హాస్టల్ లో ఉంటున్న యువతి సివిల్ పరీక్షలు రాయడానికి కోచింగ్ తీసుకుంటున్నది. ప్రియుడు సొంతంగా మెడికల్ షాప్ పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. నాలుగు రోజుల నుంచి యువతి నుంచి ఫోన్ కాల్స్ రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. యువతి కనపడటం లేదని పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అర్దరాత్రి ప్రియుడు కారులో బయలుదేరాడు. పోలీసులు ప్రియుడిని విచారణ చేసి కారులో సోదా చేశారు. కారు డిక్కీలో ప్రియురాలు శవమై కనిపించింది. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు నాలుగు రోజులు శవాన్ని మెడికల్ షాప్ లోనే పెట్టాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

సివిల్ పరీక్షలకు కోచింగ్

సివిల్ పరీక్షలకు కోచింగ్

ఛత్తీస్ గఢ్ లోని భిలాయ్ ఏరియాలో ప్రియాంక సింగ్ (24) అనే యువతి నివాసం ఉంటున్నది. బాగా చదువుతున్న ప్రియాంక సింగ్ బిలాస్ పూర్ జిల్లాలోని దయాల్ బంద్ ప్రాంతంలో హాస్టల్ లో ఉంటున్న యువతి సివిల్ పరీక్షలు రాయడానికి కోచింగ్ తీసుకుంటున్నది. ఇదే సందర్బంలో అశీష్ సాహు అలియాస్ ఆశీష్ అనే యువకుడు ప్రియాంకకు పరిచయం అయ్యాడు.

ప్రేమికులు హ్యాపీ

ప్రేమికులు హ్యాపీ

గత సంవత్సరం ప్రియాంక, ఆశీష్ ప్రేమించుకున్నారు. ప్రియుడు ఆశీష్ సొంతంగా మెడికల్ షాపు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. మెడికల్ షాప్ దగ్గరకు వెలుతున్న ప్రియాంక ఆమె ప్రియుడు ఆశీష్ తో గంటలు గంటలు మాట్లాడింది. ఆశీష్ పేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్నాడు. షేర్ మార్కెట్ వివరాలను ఆశీష్ అతని ప్రియురాలు ప్రియాంకాకు చెప్పాడు.

రూ. 4 లక్షలు ఇచ్చిన గర్ల్ ఫ్రెండ్

రూ. 4 లక్షలు ఇచ్చిన గర్ల్ ఫ్రెండ్

షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని, నీ దగ్గర ఉంటే డబ్బులు ఇవ్వాలని ఆశీష్ అతని గర్ల్ ఫ్రెండ్ కు చెప్పాడు. ప్రియాంక ఆమె ప్రియుడు ఆశీష్ కు రూ. 4 లక్షలు ఇచ్చింది. షేర్ మార్కెట్ లో ప్రియాంక పెట్టిన డబ్బుకు రూ. 5 లక్షల లాభం వచ్చింది. ఆ డబ్బు ప్రియాంకకు ఇచ్చేశాడు.

ఒకేసారి రూ. 11 లక్షలు హామ్ ఫట్

ఒకేసారి రూ. 11 లక్షలు హామ్ ఫట్

ఇటీవల షేర్ మార్కెట్ లో ఆశీష్ కు వరుస దెబ్బలుపడ్డాయి. ఒకేసారి రూ. 11 లక్షలు పోగొట్టుకున్న ఆశీష్ ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. తాను షేర్ మార్కెట్ లో పెట్టిన రూ. 4 లక్షలు వెనక్కి ఇచ్చేయాలని చెప్పింది. రోజు మెడికల్ షాప్ దగ్గరకు వెళ్లి రూ. 4 లక్షలు ఇవ్వాలని ప్రియాంక ఆమె ప్రియుడు ఆశీష్ మీద చాలా ఒత్తిడి చేసింది.

మెడికల్ షాప్ లో నాలుగు రోజులు శవం

మెడికల్ షాప్ లో నాలుగు రోజులు శవం

ప్రియురాలు ప్రియాంక టార్చర్ ఎక్కువ అయ్యిందని రగిలిపోయిన ఆశీష్ ఆమెను మెడికల్ షాప్ లోపలికి పిలింపుచుకుని ఎప్పటిలాగే గంట సేపు మాట్లాడాడు. తరువాత మెడికల్ షాప్ షట్టర్ వేసి ప్రియాంకను చంపేశాడు. నాలుగు రోజులు మెడికల్ షాపులోనే ప్రియాంక శవం పెట్టి దుర్వాసన రాకుండా రూమ్ పర్ఫ్యూమ్ చల్లుతూ, శవం మీద పెనాయిల్ వేస్తూ వచ్చాడు.

మిస్సింగ్ కేసు, మెడికల్ షాపులో దుర్వాసన రాకుండా ?

మిస్సింగ్ కేసు, మెడికల్ షాపులో దుర్వాసన రాకుండా ?

నాలుగు రోజుల నుంచి ప్రియాంక నుంచి ఫోన్ కాల్స్ రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. ప్రియాంక కనపడటం లేదని పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నాలుగు రోజులకు ప్రియంక శవం నుంచి దుర్వాసన రావడంతో ఆశీష్ భయపడిపోయాడు. ప్రియాంక శవాన్ని ప్లాస్టిక్ కవర్ లో వేసి టార్ పాల్ లో చుట్టి అర్దరాత్రి అతని కురులో పెట్టాడు.

అర్దరాత్రి చిక్కిపోయిన ప్రియుడు

అర్దరాత్రి చిక్కిపోయిన ప్రియుడు

అప్పటికే ప్రియాంక మొబైల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఆశీష్ మీద నిఘా వేశారు. అర్దరాత్రి ఆశీష్ అతని కారులో ప్రియాంక శవం పెట్టుకుని ఆ శవం విసిరేయడానికి బయలుదేరాడు. పోలీసులు ఆశీష్ కారు నిలిపి అతన్ని విచారణ చేసి కారులో సోదా చేశారు. కారు డిక్కీలో ప్రియాంక శవమై కనిపించడంతో పోలీసులు హడలిపోయారు.

అందుకే ప్రియాంకను చంపేశాను

అందుకే ప్రియాంకను చంపేశాను

ప్రియురాలు ప్రియాంకను హత్య చేసిన ఆమె ప్రియుడు ఆశీష్ నాలుగు రోజులు శవాన్ని మెడికల్ షాప్ లోనే పెట్టాడని వెలుగు చూడటం కలకలం రేపింది. ఆర్థిక లావాదేవీలు, షేర్ మార్కెట్ వ్యవహారంలో ప్రియాంకను తాను హత్య చేశానని ఆశీష్ అంగీకరించాడని భిలాయ్ పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+