Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lover: వారంలో ప్రియురాలి పెళ్లి, పెళ్లి కొడుకు మీద యాసిడ్ పోసిన ప్రియుడు, పక్లాప్లాన్ తో రెక్కీ !

చెన్నై/ తిరుప్పూర్/ అంబూర్: యువతి, యువకుడి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమికులు సమీప బంధువులు కూడా కావడంతో ఎలాగైనా ప్రియురాలిని పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి జీవించాలని ప్రియుడు అనుకున్నాడు. చాలా కాలం ప్రియుడితో తిరిగిన యువతి కొంతకాలంగా ఆ యువకుడకి దూరం అవుతూ వచ్చింది. ప్రియురాలితో ఆమె ప్రియుడు అప్పడప్పుడు ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఇదే సమయంలో ప్రియుడికి షాకింగ్ విషయం ఒకటి తెలిసింది. తన ప్రియురాలికి నిశ్చితార్థం జరిగిపోయిందని, రెండు వారాల్లో పెళ్లి చెయ్యడానికి ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. పెళ్లి ఆపడానికి, ప్రియురాలితో మాట్లాడటానికి ప్రియుడు అనేక ప్రయత్నాలు చేశాడు. ఏదీ సాధ్యం కాకపోవడంతో పెళ్లి ఎలాగైనా ఆపేయాలని ప్రియుడు పెళ్లి కొడుకు మీద ఫోకస్ పెట్టాడు. అంతే పెళ్లి కొడుకు అడ్రస్ తెలుసుకున్న ప్రియుడు అక్కడికి వెళ్లి పోయాడు. పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడు ?, రోజు ఎవరెవరిని కలుస్తున్నాడు అంటూ రెక్కీ నిర్వహించాడు. సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వెలుతున్న పెళ్లి కొడుకును బైక్ లో వెంబడించిన ప్రియుడు టైమ్ కోసం ఏదురు చూశాడు. స్నేహితుల దగ్గర పెళ్లి కొడుకు బైక్ నిలిపిన వెంటనే బ్యాగ్ లో ఉన్న యాసిడ్ బాటిల్ తీసుకున్న ప్రియుడు దానిని పెళ్లి కొడుకు ముఖం, శరీరం మీద పోసేయడం, అతని ముఖం శరీరం కాలిపోవడం కలకలం రేపింది.

 సమీప బంధువులు

సమీప బంధువులు

చెన్నైలో రజియా, రసూల్ (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) అనే యువతి యువకుడు నివాసం ఉంటున్నారు. ఒకే ఏరియాలో ఉంటున్న రజియా అనే యువతి, రసూల్ సమీప బంధువులు కావడంతో చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. చాలా కాలం రజియా, రసూల్ సంతోషంగా చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారని సమాచారం. ఎలాగైనా రజియాను పెళ్లి చేసుకుని జీవితాంతం ఆమెతో కలిసి జీవించాలని ప్రియుడు రసూల్ అనుకున్నాడు.

రెండు నెలల క్రితం ?

రెండు నెలల క్రితం ?

చాలా కాలం ప్రియుడితో తిరిగిన రజియా గత రెండు నెలల నుంచి ప్రియుడు రసూల్ తో కలవడం తగ్గించింది. కొంతకాలంగా ప్రియుడు రసూల్ కి దూరం అవుతూ వచ్చిన రజియా ఇంటికే ఎక్కువగా పరిమితం అయ్యింది. ప్రియురాలు రజియాతో ఆమె ప్రియుడు రసూల్ మాత్రం అప్పడప్పుడు ఫోన్ లో మాట్లాడుతున్నాడని సమాచారం.

ప్రియుడికి షాక్

ప్రియుడికి షాక్

ఇదే సమయంలో ప్రియుడు రసూల్ కు షాకింగ్ విషయం ఒకటి తెలిసింది. తన ప్రియురాలు రజియాకు వేరే యువకుడితో నిశ్చితార్థం జరిగిపోయిందని, రెండు వారాల్లో పెళ్లి చెయ్యడానికి ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. పెళ్లి ఆపడానికి, ప్రియురాలు రజియాతో మాట్లాడటానికి ఆమె ప్రియుడు రసూల్ అనేక ప్రయత్నాలు చేశాడు.

 పెళ్లి కొడుకుకు మీద ఫోకస్ పెట్టిన ప్రియుడు

పెళ్లి కొడుకుకు మీద ఫోకస్ పెట్టిన ప్రియుడు


తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని అంబూర్ లోని కేఎం నగర్ లో నివాసం ఉంటున్న షమీల్ అహమ్మద్ తో తన ప్రియురాలు రజియా పెళ్లి చేస్తున్నారని ప్రియుడు రసూల్ కు తెలిసింది. పెళ్లి ఆపడానికి సాధ్యం కాకపోవడంతో పెళ్లి ఎలాగైనా ఆపేయాలని ప్రియుడు రసూల్ పెళ్లి కొడుకు షమీల్ అహమ్మద్ మీద ఫోకస్ పెట్టాడు.

నాలుగు రోజులు రెక్కీ

నాలుగు రోజులు రెక్కీ


అంతే పెళ్లి కొడుకు షమీల్ అహమ్మద్ అడ్రస్ తెలుసుకున్న ప్రియుడు రసూల్ అంబూర్ వెళ్లి పోయాడు. పెళ్లి కొడుకు షమీల్ ఏం చేస్తున్నాడు ?, రోజు ఎవరెవరిని కలుస్తున్నాడు అంటూ రసూల్ రెక్కీ నిర్వహించాడు. ఎలాగైనా పెళ్లి నిలిపేయాని డిసైడ్ అయిన రసూల్ పెళ్లి కొడుకు షమీల్ మీద యాసిడ్ దాడి చెయ్యాలని డిసైడ్ అయ్యాడు.

Recommended Video

    CSK Star Ruturaj Gaikwad Savage Reply To Gossips | Sayali Sanjeev || Oneindia Telugu
    పెళ్లి కొడుకు మీద యాసిడ్ దాడి

    పెళ్లి కొడుకు మీద యాసిడ్ దాడి

    అంబూర్ లోని షూ కంపెనీలో పని చేస్తున్న షమీల్ సాయంత్రం పని ముగించుకుని బైక్ లో ఇంటికి వెలుతుంటే ప్రియుడు రసూల్ మరో బైక్ లో అతన్ని వెంబడించాడు. మార్గం మద్యలో ప్రియుడు రసూల్ మంచి టైమ్ కోసం ఏదురు చూశాడు. స్నేహితుల దగ్గరకు వెళ్లిన పెళ్లి కొడుకు షమీల్ అతని బైక్ నిలిపిన వెంటనే బ్యాగ్ లో ఉన్న యాసిడ్ బాటిల్ తీసుకున్న ప్రియుడు రసూల్ అతని మీద పోసేయడంతో ముఖం, శరీరం కాలిపోవడం కలకలం రేపింది. యాసిడ్ దాడి చేసిన రసూల్ ను పెళ్లి కొడుకు షమీల్ ఫ్రెండ్స్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తాను ప్రేమించిన అమ్మాయి పెళ్లి ఆపడానికి తాను షమీల్ మీద యాసిడ్ దాడి చేశానని రసూల్ అంగీకరించాడని పోలీసులు అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+