Lovers: తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందని కూతుర్ని చంపేశారు, రైలు పట్టాల మీద ప్రియుడి శవం !
సూరత్: కలసి చదువుకుంటున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కులాలు వేరు అయినా ప్రేమలో పడిన యువతి, యువకుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అగ్రకులానికి చెందిన యువతి కుటుంబ సభ్యులకు విషయం తెలిసి రగిలిపోయారు. తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తామని ఇప్పటికే ఆ అమ్మాయిని చితకబాదేశారు. ప్రియుడి విషయంలో అమ్మాయి ఇంట్లో ఇప్పటికే పెద్ద గొడవ జరిగింది. పెద్దలు పంచాయితీలు చేసి ఇంకోసారి అమ్మాయి జోలికి వస్తే చంపేస్తామని ప్రియుడికి వార్నింగ్ ఇప్పించారు. గొడవలు ఎక్కువ కావడంతో ప్రేమికులు పారిపోయారు. ప్రేమికుల కోసం అమ్మాయి కుటుంబ సభ్యులు గాలించారు. ఇదే సమయంలో ప్రియుడు రైలు పట్టాల మీద శవమై కనిపించాడు. ఊరి బయట పొలంలో యువతి శరీరం దాదాపుగా కాలిపోయి శవమై కనిపించడం కలకలం రేపింది. ప్రేమికుల రోజు యువతి, యువకుడు శవాలై కనిపించడంతో కలకలం రేపింది. ఈ కేసులో అమ్మాయి తల్లి, మామను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

ఒకే ఊరిలో ప్రేమికులు
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలోని భరౌకలాన్ గ్రామంలో కోమల కుమారి (20) అనే యువతి నివాసం ఉంటున్నది, ఇదే ఊరిలో శగున్ కుమార్ (22) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఒకే ఊరిలో ఉంటూ కలసి చదువుకుంటున్న కోమల కుమారి, శగున్ కుమార్ ప్రేమించుకున్నారు.

కులాలు తెచ్చిన తంటాలు
కోమల కుమారి బ్రహ్మాణ కులానికి చెందిన అమ్మాయి, శగున్ కుమార్ జూట్ కులానికి చెందినవాడు. కులాలు వేరు అయినా ప్రేమలో పడిన కోమల కుమారి, శగున్ కుమార్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అగ్రకులానికి చెందిన కోమల కుమారి కుటుంబ సభ్యులకు కూతురి లవ్ స్టోరీ గురించి తెలిసిపోవడంతో వాళ్లు రగిలిపోయారు.

చంపేస్తామని ప్రియుడికి వార్నింగ్
తక్కువ కులం వాడు అయిన శగున్ కుమార్ ను పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తామని ఇప్పటికే కోమల కుమారిని చితకబాదేశారు. ప్రియుడు శగున్ కుమార్ విషయంలో కోమల కుమారి ఇంట్లో ఇప్పటికే పెద్ద గొడవ జరిగింది. పెద్దలు పంచాయితీలు చేసి ఇంకోసారి కోమల కుమారి జోలికి వస్తే చంపేస్తామని ఆమె ప్రియుడు శగున్ కుమార్ కు వార్నింగ్ ఇప్పించారు.

వెంటాడి పట్టుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు
గొడవలు ఎక్కువ కావడంతో వారం రోజుల క్రితం ప్రేమికులు కోమల కుమారి, శగున్ కుమారి ఊరు వదిలి పారిపోయారు. ప్రేమికుల కోసం కోమల కుమారి కుటుంబ సభ్యులు గాలించారు. చివరికి కోమల కుమారి, శగున్ కుమార్ అడ్రస్ తెలుసుకుని వారిని పట్టుకున్నారని, ప్రియురాలిని ఆమె కుటుంబ సభ్యులు లాక్కొని వెళ్లిపోయారని తెలిసంది.

ప్రియురాలి హత్య..... ప్రియుడి ఆత్మహత్య
ప్రియురాలు కోమలి కుమారి దూరం అయ్యిందని ఆవేదనతో ఆమె ప్రియుడు శగున్ కుమార్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడు శగున్ కుమార్ రైలు పట్టాల మీద శవమై కనిపించడంతో అందరూ హడలిపోయారు. ఇదే సమయంలో ఊరి బయట పొలంలో కోమలి కుమారి శరీరం దాదాపుగా కాలిపోయి శవమై కనిపించడం కలకలం రేపింది. కోమలి కుమారిని ఆమె కుటుంబ సభ్యులు గొంతు కోసి చంపేసి తరువాత పెట్రోల్ పోసి తగలబెట్టారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ప్రేమికుల రోజు యువతి, యువకుడు శవాలై కనిపించడంతో కలకలం రేపింది. ఈ కేసులో కోమలి కుమారి తల్లి, మామను మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications