Girl: సోషల్ మీడియా బాయ్ ఫ్రెండ్ కోసం వెళ్లి ?, ఎంత అందంగా ఉంటే ఏం లాభం !

యువతి, యువకుడు ప్రేమించుకుని పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేశారు. దెబ్బకు ఒకరు హత్యకు గురైనారు. సోషల్ మీడియా బాయ్ ఫ్రెండ్ ను నమ్ముకుని వెళ్లి అతనితో సహజీవనం చేసి అతని చేతిలోనే అందమైన యువతి హత్యకు గురికావడం కలకలం రేపింది

బెంగళూరు/హాసన్: యువతి, యువకుడు కాలేజ్ లో కలిసి చదువుకోలేదు. ఇద్దరూ ఎదురు ఎదరుగా మాట్లాడుకోలేదు. కాని సోషల్ మీడియాలో యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. యువతికి ఆ యువకుడు ఏం చెప్పాడో తెలీదు కాని ఇద్దరూ ప్రేమలో పడిపోయారు. యువతి, యువకుడు ప్రేమించుకుని పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేశారు. దెబ్బకు ఒకరు హత్యకు గురైనారు. సోషల్ మీడియా బాయ్ ఫ్రెండ్ ను నమ్ముకుని వెళ్లి అతనితో సహజీవనం చేసి అతని చేతిలోనే అందమైన యువతి హత్యకు గురికావడం కలకలం రేపింది.

 బెంగళూరు అమ్మాయి

బెంగళూరు అమ్మాయి

బెంగళూరు నగరంలోని విజయనగర్ లో నివాసం ఉంటున్న సిరి (22) అనే యువతికి 8 నెలల క్రితం ఆది (28) అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆది కర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందిన వాడు. సిరి చూడటానికి ఎర్రగా బుర్రగా ఉంటుంది. సిరి ఫోటోలు సోషల్ మీడియాలో చూసిన ఆది ఆమె మీద మోజు పడ్డాడు.

 ప్రియుడి కోసం ఎస్కేప్

ప్రియుడి కోసం ఎస్కేప్

తరువాత కొన్ని రోజుల్లోనే ఆది, సిరి వాళ్ల ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకున్నారు. సిరికి ఆది మాయమాటలు చెప్పి ఆమెనువలలో వేసుకున్నాడు. నువ్వు లేకపోతే నేను లేను అని ఆది సినిమా డైలాగులు చెప్పడంతో సిరి ఆమె వలలో పడిపోయింది. కుటుంబ సభ్యులకు ఏమాత్రం చెప్పకుండా సిరి ఆమె ప్రియుడు ఆది చెప్పిన హాసన్ లోని ప్రాంతానికి వెళ్లిపోయింది.

పెళ్లి కాకుండానే సహజీవనం

పెళ్లి కాకుండానే సహజీవనం

సిరి దగ్గరకు రావడంతో యవ్వనంలో ఉన్న ఆది తట్టుకోలేకపోయాడు. గుడ్డనహళ్లిలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న ఆది, సిరి కలసి కాపురం చెయ్యడం మొదలు పెట్టారు. చుట్టుపక్కల వారికి దంపతులు అని చెప్పిన ఆది, సిరి పెళ్లి చేసుకోకుండానే కొన్ని నెలల నుంచి సహజీవనం చేస్తున్నారు. కుటుంబ పోషణ కోసం హాసన్ లోని ఓ పెట్రోల్ బంకులో ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఇంటిలో ప్రియురాలు సిరిని ఆమె ప్రియుడు ఆది ఓ వైర్ తో గొంతు నులిమి హత్య చేసి ఎస్కేప్ అయ్యాడు.

 ప్రియురాలిని చంపేసి ప్రియుడు ఎస్కేప్

ప్రియురాలిని చంపేసి ప్రియుడు ఎస్కేప్

పెళ్లి చేసుకుంటాడని నమ్మి సోషల్ మీడియా ప్రియుడిని నమ్మి అందర్ని వదిలి వచ్చిన సిరి దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. సిరిని హత్య చేసిన ఆమె కన్నింగ్ ప్రియుడు ఆది కోసం హాసన్ పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తూ ప్రియుడి చేతిలో సిరి హత్యకు గురికావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+