Lovers: గర్ల్ ఫ్రెండ్ తో సీక్రేట్ పెళ్లి, మూడేళ్లకు మరో వ్యక్తితో గర్ల్ ఫ్రెండ్ పెళ్లి, సినిమా స్టోరీ లెవల్లో
పెళ్లి చేసుకున్న తరువాత కూడా మూడు సంవత్సరాల వరకు లవర్స్ ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉన్నారు. చివరికి ప్రియురాలు వేరే యువకుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం కావడం, పెళ్లి పత్రికలు పంచిపెట్టడంతో ప్రియుడు ?
బెంగళూరు: యువతి, యువకుడికి పరియం అయ్యింది. ఇద్దరి పరిచయం ప్రేమగా మారడంతో హ్యాపీగా తిరిగారు. ప్రేమికులు ఐదు సంవత్సరాల తరువాత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చాలా ఫేమస్ గుడిలో సీక్రేట్ గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తరువాత మూడు సంవత్సరాలు ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉన్నారు. చివరికి ప్రియురాలు వేరే యువకుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం కావడం, పెళ్లి పత్రికలు పంచడంతో ప్రియుడు ఆవేదనతో రగిలిపోయాడు.
బెంగళూరులోని యశవంతపురంలో నివాసం ఉంటున్న ఓ యువకుడు ప్రియురాలు మోసం చేసిందని విషం తాగేసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అరుణ్ (38) అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డి ఆసుపత్రిలో ఉన్నాడు. గత ఎనిమిదేళ్లుగా యశవంతపురంలోనే నివాసం ఉంటున్న ఓ యువతిని అరుణ్ ప్రేమిస్తున్నాడు. ఇద్దరు ఐదు సంవత్సరాలు చాలా హ్యాపీగా తిరిగారు. మూడు సంవత్సరాల క్రితం మైసూరులోని చాముండికొండ మీదకు వెళ్లి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.

తరువాత అరుణ్, అతని ప్రియురాలు ఎవరి ఇళ్లలో వాళ్లు ఉన్నారు. నువ్వు అందరి సమక్షంలో నీ ప్రియురాలిని మరో సారి పెళ్లి చేసుకోవాలని అరుణ్ కు అతని కుటుంబ సభ్యులు చెప్పారు. మరోసారి పెళ్లి చేసుకోవాలని అరుణ్ సిద్దం అయ్యాడు. అందుకు తగ్గట్టుగానే యువతి ఇంటికి వెళ్లిన అరుణ్ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని మనవి చేశాడు. పెళ్లికి ప్రియురాలి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అరుణ్ తో యువతి పెళ్లికి ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అంతేకాకుండా అరుణ్ ను ప్రేమించిన యువతి మరో యువకుడిని పెళ్లి చేసేందుకు సిద్దం అయ్యింది.
యువతి తల్లిదండ్రులు వారి బంధువులకు వివాహ ఆహ్వానపత్రికలను పంపిణీ చేశారు. ప్రియురాలి పెళ్లిపత్రిక చూసిన అరుణ్ ఆవేదనతో కుమిలిపోయాడు. అరుణ్ అతని ప్రియురాలిని సంప్రదించేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే అతని ప్రియురాలు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆవేదనతో అరుణ్ విషం తాగేసి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అరుణ్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు బెంగళూరులోని కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications