Lovers: ప్రియురాలి ఇంట్లో చిక్కిపోయిన ప్రియుడు, చీర కట్టి ఊరేగించి మర్మాంగం ఛట్నీ చేసి చంపేశారు !

వడోదర/అహమ్మదాబాద్: ఒకే ఊరిలో ఉంటున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రియురాలి తండ్రి రాజకీయంగా, డబ్బు పరంగా పలుకుబడి కలిగిన వ్యక్తి. ప్రియుడికి డబ్బు లేకపోడం, అతను తక్కువ కులానికి చెందిన వాడు కావడంతో సమస్యలు మొదలైనాయి. కూతురి ప్రేమ విషయం తెలుసుకున్న తండ్రి ఇప్పటికే అనేకసార్లు ప్రియుడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి మా అమ్మాయి జోలికి వస్తే చంపేస్తానని అతని స్నేహితులతో వార్నింగ్ ఇప్పించాడు. అయినా ప్రేమికులు రహస్యంగా కలుస్తున్నారు. అమ్మాయి నా సైడ్ స్ట్రాంగ్ గా ఉందని, ఆమె తండ్రి నన్ను ఏమీ చెయ్యలేడని ప్రియుడు నిర్లక్షం చేశాడు. ప్రియురాలి ఇంట్లో ఎవ్వరూ లేరని తెలుసుకున్న ప్రియుడు అక్కడికి వెళ్లాడు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ప్రియురాలి తల్లి వెళ్లి విషయం గుర్తించి ఇంటి బయట తలుపు లాక్ చేసి భర్తకు సమాచారం ఇచ్చింది. రగిలిపోయిన తండ్రి, అతన్ని స్నేహితులు ప్రియుడిని పట్టుకుని ప్రియురాలి ఇంటిలోనే అతనికి ప్రియురాలి చీరకట్టి బయటకు లాక్కొచ్చి ఊరంతా ఊరేగించి ఊరి మధ్యలో కట్టేశారు. కర్రలు, రాడ్లు తీసుకుని ప్రియుడి మర్మాంగం మీద ఇష్టం వచ్చినట్లు దాడి చెయ్యడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది.

 చిన్నప్పటి ఫ్రెండ్స్...... తరువాత లవర్స్

చిన్నప్పటి ఫ్రెండ్స్...... తరువాత లవర్స్

గుజరాత్ లోని వడోదరా జిల్లాలోని జోఖారీ గ్రామంలో కాళిదాస్ మాలి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. డబ్బు పరంగా, రాజకీయంగా కాళిదాస్ కు చాలా పలుకుబడి ఉంది. ఇదే ఊరిలో జయేష్ రావల్ (21) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కాళిదాస్ కూతురు, జయేష్ రావల్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. తరువాత జయేష్ రావల్, కాళిదాస్ కూతురు ప్రేమించుకున్నారు.

 ప్రియుడు పేదవాడు..... తక్కువ కులంవాడు

ప్రియుడు పేదవాడు..... తక్కువ కులంవాడు

ప్రియుడు జయేష్ రావల్ తక్కువ కులానికి చెందిన వాడు కావడంతో సమస్యలు మొదలైనాయి. కూతురి ప్రేమ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి కాళిదాస్ రగిలిపోయాడు. తాను రాజకీయంగా ఎంతో ఎదుగుతున్నానని, మా కంటే తక్కువ కులం వాడు, డబ్బు లేనివాడు నా కూతురిని పెళ్లి చేసుకుంటే నాకు లేనిపోని ఇబ్బందులు ఎదురౌతాయని కాళిదాస్ బయపడ్డాడు.

 చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన ప్రియురాలి తండ్రి

చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన ప్రియురాలి తండ్రి

కాళిదాస్ ఇప్పటికే అనేకసార్లు అతని కూతురు ప్రియుడు జయేష్ రావల్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి మా అమ్మాయి జోలికి వస్తే నిన్ను చంపేస్తానని జయేష్ రావల్ కు ప్రియురాలి తండ్రి కాళిదాస్ తో పాటు అతని స్నేహితులు వార్నింగ్ ఇచ్చారు. అయితే ప్రియుడు జయేష్ రావల్ మాత్రం వెనక్కి తగ్గలేదు.

 ప్రియురాలి ఇంటికే వెళ్లిపోయాడు

ప్రియురాలి ఇంటికే వెళ్లిపోయాడు

అమ్మాయి నా సైడ్ స్ట్రాంగ్ గా ఉందని, ఆమె తండ్రి కాళిదాస్ నన్ను ఏమీ చెయ్యలేడని ప్రియుడు జయేష్ రావల్ నిర్లక్షం చేశాడు. ప్రియురాలి ఇంట్లో ఎవ్వరూ లేరని తెలుసుకున్న ప్రియుడు జయేష్ రావల్ అక్కడికి వెళ్లాడు. జయేష్ రావల్, అతని ప్రియురాలు ఆమె ఇంటిలో ఏకాంతంగా ఉన్న సమయంలో ప్రియురాలి తల్లి ఇంట్లోకి వెళ్లింది. కూతురు వేరే యువకుడితో కలిసి ఉన్న విషయం గుర్తించి ఇంటి బయట తలుపు లాక్ చేసిన అమ్మాయి తల్లి వెంటనే ఆమె భర్త కాళిదాస్ కు సమాచారం ఇచ్చింది.

 ప్రియుడికి చీరకట్టి ఊరంతా ఊరేగింపు

ప్రియుడికి చీరకట్టి ఊరంతా ఊరేగింపు

విషయం తెలుసుకుని రగిలిపోయిన ప్రియురాలి తండ్రి కాళిదాస్ అతని బంధువులు కిరణ్ మాలి, మోహన్ మాలి, రమేష్ మాలి తదితరులు నేరుగా ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న ప్రియుడు జయేష్ రావల్ ను పట్టుకున్నారు. తరువాత ప్రియురాలి ఇంటిలోనే జయేష్ రావల్ కు అతని ప్రియురాలి చీరకట్టి బయటకు లాక్కొచ్చి ఊరంతా ఊరేగించారు.

 మర్మాంగం మీద రాడ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి

మర్మాంగం మీద రాడ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి

ఊరేగింపుగా ఊరి మధ్యలోకి తీసుకెళ్లి అక్కడ జయేష్ రావల్ ను కట్టేశారు. కర్రలు, రాడ్లు తీసుకుని ప్రియుడు జయేష్ రావల్ మర్మాంగం, శరీరంలోనేని అనేక చోట్ల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చెయ్యడంతో అతని కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న జయేష్ కుటుంబ సభ్యులు, బంధువులు అంబులెన్స్ ను పిలిపించి అతన్ని ఆసుపత్రికి తరలించారు.

 ప్రియుడి ప్రాణం పోయింది..... అన్నంతపని చేసిన ప్రియురాలి తండ్రి

ప్రియుడి ప్రాణం పోయింది..... అన్నంతపని చేసిన ప్రియురాలి తండ్రి

ఆసుపత్రికి వెళ్లే సమయానికే ప్రియుడు జయేష్ రావల్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని వెలుగు చూడటం కలకలం రేపింది. జయేష్ రావల్ తల్లి కేసు పెట్టడంతో ప్రియురాలి తండ్రి కాళిదాస్ తోపాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. నా కూతురి జోలికి వస్తే చంపేస్తానని బెదిరించిన కాళిదాస్ నిజంగానే అతను అన్నంతపని చేశాడని ప్రియుడు జయేష్ రావల్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+