Lovers: ప్రియుడిని నరికి రెండు ముక్కలుగా నరికేసిన ప్రియురాలి ఫ్యామిలీ, సౌండ్ పార్టీలే, మ్యాటర్ వేరే !

బెంగళూరు/ బెళగావి: ఒకే ఏరియాలో ఉంటున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ప్రేమికులు రెండు సంవత్సరాలు హ్యాపీగా తిరిగారు. ప్రియుడి తల్లి ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తుండటంతో ఆర్థికంగా అతను బాగానే ఉన్నాడు. అమ్మాయి తండ్రి కూడా డబ్బులో బాగా ఉన్నవాడే. అయితే ఇద్దరి మతాలు వేరుకావడంతో పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్దలు పంచాయితీలు చేసి ప్రేమికులను విడగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అమ్మాయి కుటుంబ సభ్యుల దెబ్బకు ప్రియుడి కుటుంబం ఊరు వదిలేసి వెళ్లిపోయింది. ప్రభుత్వ టీచర్ అయిన ప్రియుడి తల్లి లాంగ్ లీవ్ లో ఉంటున్నది. ఇదే సమయంలో ప్రియుడిని రెండు ముక్కలుగా నరికేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు, వారి మద్దతు దారులు తల, మొండెం వేర్వేరుగా రైల్వే ట్రాక్ మీద విసిరేయడం కలకలం రేపింది. యువకుడి హత్య కేసులో అమ్మాయి తల్లిదండ్రులతో పాటు మొత్తం 10 మందిని పోలీసులు అరెస్టు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రేమికులు

ప్రేమికులు

కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని ఖానాపూర్ లోని మారుతినగర్ లో ఈరప్ప అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈరప్పకు రమ్యశ్రీ (పేరు మార్చడం జరిగింది) అనే కుమార్తె ఉంది. ఇదే ఏరియాలో అర్బాజ్ ముల్లా (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఒకే ఏరియాలో ఉంటున్న అర్బాజ్, రమ్యశ్రీ గత రెండు సంవత్సరాల క్రితం నుంచి ప్రేమించుకున్నారు.

 హ్యాపీగా ఉన్నారు కాని ?

హ్యాపీగా ఉన్నారు కాని ?

అర్బాజ్, రమ్యశ్రీ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ప్రేమికులు రెండు సంవత్సరాలు హ్యాపీగా తిరిగారు. ప్రియుడు అర్బాజ్ తల్లి ప్రభుత్వ స్కూల్ లో ఉర్దూ టీచర్ గా ఉద్యోగం చేస్తుండటంతో ఆర్థికంగా అతను బాగానే ఉన్నాడు. రమ్యశ్రీ తండ్రి ఈరప్ప కూడా డబ్బులో బాగా ఉన్నవాడే. ఇద్దరూ ఆర్థికంగా బాగా ఉండటంతో ఆ విషయం వీరి పెళ్లికి అడ్డుకాలేదు.

మతాలు వేరు..... పెద్దలు పంచాయితీలు

మతాలు వేరు..... పెద్దలు పంచాయితీలు

అర్బాజ్, రమ్యశ్రీ ఇద్దరి మతాలు వేరుకావడంతో పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్దలు పంచాయితీలు చేసి ప్రేమికులను విడగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అర్బాజ్ ను బెదిరించి ఆమ్మాయిని వదిలేయపోతే నిన్ను చంపేస్తామని బెదిరించారు. అర్బాజ్ మాట వినకపోవడంతో శ్రీరామసేన హిందుస్తాన్ సంఘం నాయకుడు పుండలీక అలియాస్ మహారాజ కూడా రంగంలోకి దిగి రమ్యశ్రీని వదిలేయపోతే నిన్ను అర్బాజ్ ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడని ఆరోపణలు ఉన్నాయి.

కొడుకు కోసం ఊరు వదిలేసిన లేడీ టీచర్

కొడుకు కోసం ఊరు వదిలేసిన లేడీ టీచర్

అమ్మాయి రమ్యశ్రీ కుటుంబ సభ్యుల దెబ్బకు ప్రియుడు అర్బాజ్ కుటుంబం ఖానాపుర ఊరు వదిలేసి బెళగావికి వెళ్లిపోయారు. ప్రభుత్వ టీచర్ అయిన ప్రియుడి తల్లి లాంగ్ లీవ్ లో ఉంటున్నది. బెళగావికి వెళ్లినా అర్బాజ్ నిత్యం అతని ప్రియురాలు రమ్యశ్రీతో టచ్ లో ఉన్నాడు. మామాట వినకుండా మా అమ్మాయికి మాయమాటలు చెబుతున్న అర్బాజ్ ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడని రమ్యశ్రీ తండ్రి ఈరప్ప రగిలిపోయాడు.

రాజీ కోసం పిలిపించారు.... ఎదురు తిరిగిన ప్రియుడు

రాజీ కోసం పిలిపించారు.... ఎదురు తిరిగిన ప్రియుడు

అర్బాజ్ తో మాట్లాడాలని అతన్ని ఖానాపురాకు పిలిపించారు. తల్లితో కలిసి అర్బాజ్ పంచాయితీకి వెళ్లాడు. పెద్దలు పంచాయితీలు చేస్తున్న సమయంలో తాను తన ప్రియురాలిని వదలని, మీకు చేతనైయ్యింది మీరు చేసుకోవాలని అర్బాజ్ ఎదురు తిరిగాడు. ఇక మాట్లాడటం, పంచాయితీలు చెయ్యడం ఏమీ లేదని చెప్పిన హిందూ సంఘం నాయకుడు పుండలీక ప్రియుడు అర్బాజ్ ను చంపేయాలని డిసైడ్ అయ్యాడని పోలీసులు అంటున్నారు.

 అడ్డంగా రెండు ముక్కలుగా నరికేసి విసిరేశారు

అడ్డంగా రెండు ముక్కలుగా నరికేసి విసిరేశారు


11 రోజుల క్రితం అర్బాజ్ ను నిర్జన ప్రదేశంలోని పిలుచుకుని వెళ్లి అతన్ని రెండు ముక్కలుగా నరికి చంపేశారు. తరువాత శవం ఆనవాళ్లు చిక్కకూండా చెయ్యాలని అర్బాజ్ తల, మొండెం తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద విసిరేశారు. అర్బాజ్ ను హత్య చేశారని అతని తల్లి కేసు పెట్టింది. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేసినా చివరికి ప్రేమ విషయంలో హత్య జరిగిందని నిర్దారించారు.

నమ్మించి చంపేశారు

నమ్మించి చంపేశారు


అర్బాజ్ ప్రియురాలు తండ్రి ఈరప్ప, తల్లి సుశీల కుంబార, శ్రీరామసేన నాయకుడు పుండలీక అలియాస్ మహారాజ, కుతుబుద్దీన్, మారుతి, మంజునాథ, గణపతి, ప్రశాంత్, ప్రవీణ్, శ్రీదర్ అనే 8 మందిని అరెస్టు చేశామని డీఎస్పీ శివానంద శుక్రవారం మీడియాకు చెప్పారు. ప్రేమ విషయంలో అర్బాజ్ ను అతిదారుణంగా నరికి చంపేసి శవాన్ని రెండు ముక్కలు చెయ్యడం బెళగావితో సహ కర్ణాటకలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+