Lovers: గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్, ఆన్ లైన్ జూదం, ప్రేమికులు ఎంజాయ్, 20 సీసీటీవీల దెబ్బకు ఢమాల్ !

చెన్నై/ కోయంబత్తూరు: కాలేజ్ లో చదువుతున్న యువకుడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చెయ్యడానికి అతనికి ఇంట్లో ఇచ్చే డబ్బులు ఖర్చులకు సరిపోలేదు. ఇదే సమయంలో ఫ్రెండ్స్ దగ్గర అతను అప్పులు చేశాడు. యువకుడి తండ్రికి డబ్బులు, ఆస్తులు ఎక్కువగా ఉండటంతో అతనికి అప్పు ఇచ్చే వాళ్లు ఎక్కువ అయ్యారు. ఇదే సమయంలో ఆన్ లైన్ లో జూదం ఆడటం మొదలు పెట్టాడు. ఆన్ లైన్ లో జూదం ఆడుతున్న యువకుడు భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు .గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్ అని భ్రమపడిన ప్రియుడు ఆమె చేత ఆన్ లైన్ లో జూదం ఆడించాడు. ఆన్ లైన్ జూదం దెబ్బతో ప్రియుడు లక్షల రూపాయల అప్పులు చేశాడు. దెబ్బకు అప్పులు ఇచ్చిన వాళ్లు ప్రియుడి వెంటపడ్డారు. చేసిన అప్పులు తీర్చడానికి వడ్డీలు కట్టడానికి ప్రియుడు అతని ప్రియురాలితో కలిసి కిలాడీ స్కెచ్ వేశాడు. 20 సీసీటీవీ కెమెరాల దెబ్బకు ప్రియుడు, ప్రియురాలు పోలీసులకు చిక్కిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

 కాలేజ్ స్టూడెంట్

కాలేజ్ స్టూడెంట్

తమిళనాడులోని కోయంబత్తూరులో తొండమత్తూరులో రూపా (పేరు మార్చడం జరిగింది) (20) అనే యువతి నివాసం ఉంటున్నది. వాడవల్లి సోమయ్యపాలెంలో ప్రసాద్ (20) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ప్రసాద్ ఇన్పర్మేషన్ టెక్నాలజీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రసాద్, రూపాకు పరిచయం కావడంతో తరువాత ఇద్దరూ ప్రేమించుకున్నారు.

 గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్..... ఆన్ లైన్ జూదం

గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్..... ఆన్ లైన్ జూదం

గర్ల్ ఫ్రెండ్ రూపాతో ఎంజాయ్ చెయ్యడానికి ప్రసాద్ కు అతని ఇంట్లో ఇచ్చే డబ్బులు ఖర్చులకు సరిపోలేదు. ఇదే సమయంలో ఫ్రెండ్స్ దగ్గర ప్రసాద్ ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేశాడు. ప్రసాద్ తండ్రికి డబ్బులు, ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని అతనికి అప్పు ఇచ్చే వాళ్లు ఎక్కువ అయ్యారు. ఇదే సమయంలో ప్రసాద్ ఆన్ లైన్ లో జూదం ఆడటం మొదలు పెట్టాడు.

 విపరీతంగా అప్పులు చేశాడు

విపరీతంగా అప్పులు చేశాడు

ఆన్ లైన్ లో జూదం ఆడుతున్న ప్రసాద్ భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు .గర్ల్ ఫ్రెండ్ రూపా హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్ అని భ్రమపడిన ప్రియుడు ప్రసాద్ ఆమె చేత ఆన్ లైన్ లో జూదం ఆడించాడు. ఆన్ లైన్ జూదం దెబ్బతో ప్రియుడు ప్రసాద్ లక్షల రూపాయల అప్పులు చేశాడు.

 చైన్ స్నాచింగ్ లు చేసి అరెస్టు అయిన ప్రేమికులు

చైన్ స్నాచింగ్ లు చేసి అరెస్టు అయిన ప్రేమికులు

దెబ్బకు అప్పులు ఇచ్చిన వాళ్లు ప్రియుడు ప్రసాద్ వెంటపడ్డారు. చేసిన అప్పులు తీర్చడానికి వడ్డీలు కట్టడానికి ప్రియుడు ప్రసాద్ అతని ప్రియురాలు రూపాతో కలిసి చైన్ స్నాచింగ్ లు చెయ్యాలని కిలాడీ స్కెచ్ వేశాడు. తేజస్విని అనే మహిళ మోడలో ప్రేమికులు బంగారు గొలుసు లాక్కొని పరారైనారు. తేజస్విని ఫిర్యాదు చెయ్యడంతో రంగంలోకి దిగిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు.

 20 సీసీటీవీల దెబ్బతో ప్రేమికులు ?

20 సీసీటీవీల దెబ్బతో ప్రేమికులు ?

తేజస్విని మెడలో బంగారు గొలుసు లాక్కొని పరారైన పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. 20 సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు బైక్ నెంబర్ ఆధారంగా మొదట ప్రసాద్ ను, తరువాత అతని ప్రియురాలిని అరెస్టు చుశారు. సీసీటీవీల దెబ్బకు ప్రియుడు, ప్రియురాలు పోలీసులకు చిక్కిపోవడం కోయంబత్తూరు జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+