ప్రేమికులకు కులం, ఆస్తి అడ్డంకి, పెళ్లి చేసుకున్న కొన్ని గంటల్లో ఆత్మహత్య!

బెంగళూరు: ఎనిమిది సంవత్సరాల నుంచి ఒకరిని ఒకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. అయితే వారి ప్రేమకు కులం, ఆస్తి అడ్డంకి అయ్యింది. పెళ్లి చేసుకోవడానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని సుఖంగా జీవించలేమని ఆ ప్రేమింకులు ఓ నిర్ణయానికి వచ్చారు. అంతే ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పెళ్లి చేసుకున్న కొన్ని గంటలకే నవదంపతులు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు.

8 సంవత్సరాల ప్రేమ

8 సంవత్సరాల ప్రేమ

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలుకాకు చెందిన నూతన్ (25), అపూర్వ (22) గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. అపూర్వకు ఊహతెలిసినప్పటి నుంచి నూతన్ ను ఎంతో ప్రేమించింది, నూతన్ సైతం అపూర్వ అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు.

కులం, ఆస్తి అడ్డంకి!

కులం, ఆస్తి అడ్డంకి!

నూతన్ ఒక్కలిగ కులంలో పుట్టాడు. అపూర్వ బిల్లవ (తక్కువ జాతి అని అర్థం) కులంలో పుట్టింది. అయితే వీరు కులం పక్కన పెట్టి ఒకరిని ఒకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. నూతన్ కుటుంబ సభ్యులకు రూ. కోట్ల విలువైన చాల ఎకరాల కాఫీ తోటలు ఉన్నాయి. అపూర్వ తల్లి ఓ ప్రభుత్వ పాఠశాలలో వంట మనిషిగా పని చేస్తోంది. నూతన్, అపూర్వాల ప్రేమకు కులం, ఆస్తి అడ్డంకి అయ్యింది.

పెళ్లి చేసుకుంటే అంతే!

పెళ్లి చేసుకుంటే అంతే!

ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు చెప్పిన నూతన్, అపూర్వ పెళ్లి చేసుకుంటామని చెప్పారు. అయితే నూతన్, అపూర్వ పెళ్లి చేసుకోవడానికి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు అడ్డు చెప్పారు మీరు పెళ్లి చేసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని నూతన్ కుటుంబ సభ్యులు హెచ్చరించారని తెలిసింది.

 పెద్దలను ఎదిరించలేక!

పెద్దలను ఎదిరించలేక!

పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని సుఖంగా జీవించలేమని నూతన్, అపూర్వ నిర్ణయించారు. పెళ్లి చేసుకుని సుఖంగా ఉండలేమని, ఆత్మహత్య చేసుకుందామని ఓ నిర్ణయానికి వచ్చారు. రెండు రోజుల క్రితం నూతన్, అపూర్వ బణకల్ ప్రాంతంలో విషం సేవించారు. విషయం గుర్తించిన స్థానికులు వారిని వెంటనే స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించి మంగళూరు ఆసుపత్రికి తరలించారు.

పెళ్లి చేసుకున్న రోజే!

పెళ్లి చేసుకున్న రోజే!

కుటుంబ సభ్యులను ఎదిరించిన నూతన్, అపూర్వ పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి జీవించలేమని నిర్ణయించి అదే రోజు విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేశారు. శరీరం మొత్తం విషం వ్యాపించడంతో మంగళూరు ఆసుపత్రిలో చికిత్స విఫలమై నూతన్, అపూర్వ మరణించారు. బణకల్, గోణిబీడు పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పెళ్లి చేసుకున్న రోజే విషం సేవించి ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి స్నేహితులు విలపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+