పెళ్లికి పెద్దలు నో, ఇంటి నుంచి ప్రేమికులు ఎస్కేప్, నాలుగు రోజులకే ఆత్మహత్య!
బెంగళూరు: కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారని ఆవేదనతో ఇల్లు విడిచి వెళ్లిన ప్రేమికులు ఒకే చోట ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లా ఆలూరు తాలుకాలో జరిగింది. అశోక్ (230, నయన (17) అనే ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు.
అశోక్, నయన కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. అశోక్, నయన వారి ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు చెప్పారు. అశోక్, నయన పెళ్లి చేసుకోవడానికి ఇరు కుటుంబ సభ్యులు నిరాకరించారు.

పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ఆవేదనతో అశోక్, నయన నాలుగు రోజుల క్రితం ఇల్లు విడిచిపారిపోయారు. అశోక్, నయనల కోసం వారి కుటుంబ సభ్యులు గాలించారు. అయితే మంగళవారం హాసన్ జిల్లా ఆలూరు తాలుకాలోని పాళ్య ప్రాంతంలోని పోలంలో ఉన్న ఓ చెట్టుకు ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కేసు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications