Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

lovers: ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్టు, పెళ్లి కాకుండానే ఇంట్లో ప్రియుడితో, ఏం జరిగిందో ?, ఫ్రెండ్ కు !

కొచ్చి/చెన్నై/హైదరాబాద్: పెళ్లి చేసుకోకుండా ప్రియుడితో కలిసి సహజీవనం సాగిస్తున్న ఆర్టిస్టు ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న డబ్బింగ్ ఆర్టిస్టు సంతోషంగా ఉందని అందరూ అనుకున్నారు. అయితే ఎక్కడ తేడా వచ్చిందో ఏమో కాని ఇంట్లో ప్రేమికులు గొడవపడ్డారని తెలిసింది. మొదట డబ్బింగ్ ఆర్టిస్టు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె ప్రియుడు ఓ స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడు. తన ప్రియురాలు దూరం అయ్యిందని, నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని ప్రియుడు అతని స్నేహితుడికి చెప్పాడు. పోలీసులు, స్నేహితుడు వెళ్లి చూసే సమయానికి ప్రియుడు శవమైనాడు. అయితే ప్రియుడి మేడ మీద గదిలో శవమైకనిపించడం, ప్రియురాలి మెడకు తేడా కత్తిరించి ఉండటం, ఆమె శవం బెడ్ రూమ్ లో మంచం మీద అనుమానాస్పదంగా పడి ఉండటంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు.

 ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్టు

ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్టు

కేరళలోని అల్పజు సమీపంలోని పంగప్పరై ప్రాంతంలో రూబీ (35) అనే మహిళ నివాసం ఉంటున్నది. అనేక మలయాళ సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేసిన రూబీ మంచి పేరు తెచ్చుకునింది. అనేక మలయాళ సినిమాలకు రూబీ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇచ్చి మలయాళ చిత్రపరిశ్రమలో ఆమె కంటూ మంచి గుర్తింపు తెచ్చుకునింది.

 తిరువనంతపురం ప్రియుడు

తిరువనంతపురం ప్రియుడు

కేరళలోని తిరువనంతపురంలోని వాంజియూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సునీల్ (45) అనే వ్యక్తి రూబీకి పరిచయం అయ్యాడు. రూబీ, సునీల్ పరిచయం ప్రేమగా మారింది. రూబీ, సునీల్ పెళ్లి చేసుకోకుండానే సహజీవనం సాగించారు. చెర్తాలా ప్రాంతంలో నివాసం ఉండే రూబీ తరువాత ప్రియుడు సునీల్ తో కలిసి అల్పజు సమీపంలోని పంగప్పరై ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. రూబీ, సునీల్ మద్య వయసులో 10 సంవత్సరాలు తేడా ఉంది.

రూబీది హ్యాపీలైఫ్

రూబీది హ్యాపీలైఫ్

డబ్బింగ్ ఆర్టిస్టుగా బాగా సంపాదిస్తున్న రూబీ ఆమె ప్రియుడు సునీల్ తో కలిసి సంతోషంగా ఉండేదని తెలిసింది. అల్పజు ప్రాంతం సముద్ర తీరప్రాంతం కావడంతో నిత్యం ప్రేమికులు రూబీ, సునీల్ బోటింగ్ చేస్తూ ఎంజాయ్ చేసేవాళ్లని తెలిసింది. సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చే టైమ్ లో మాత్రమే రూబీ స్టూడియోకి వెళ్లి వచ్చేదని తెలిసింది.

నా ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది

నా ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది

స్నేహితుడికి ఫోన్ చేసిన సునీల్ తన ప్రియురాలు రూబీ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. నేను వెంటనే బయలుదేరి వస్తున్నానని సునీల్ కు అతని స్నేహితుడు చెప్పాడు. అదే సమయంలో తన ప్రియురాలు రూబీ లేని జీవితంలో తాను ఉండలేనని, తాను ఆత్మహత్య చేసుకుంటానని సునీల్ అతని స్నేహితుడికి చెప్పాడు. ఆ సమయంలో నేను వస్తున్నానని, నువ్వు ధైర్యంగా ఉండాలని అతని ఫ్రెండ్ సునీల్ కు చెప్పాడు.

బెడ్ రూమ్ శవమైన రూబి.... మేడ మీద సునీల్ శవం

బెడ్ రూమ్ శవమైన రూబి.... మేడ మీద సునీల్ శవం


పోలీసులను పిలుచుకుని అతని స్నేహితుడు సునీల్ ఇంటికి వెళ్లాడు. ఇంటి లోపల లాక్ చెయ్యడంతో పోలీసులు తలపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. గ్రౌండ్ ఫ్లోర్ లోని బెడ్ రూమ్ లో మంచం మీద రూబీ శవమై కనిపించింది. వెంటనే పోలీసులు మేడ మీదకు పరుగు తీశారు. మేడ మీద ఓ గదిలో సునీల్ ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించాడు.

Recommended Video

    Telangana Lockdown : జాతరను మరిపించిన వైన్ షాపులు.. గంటలకొద్దీ క్యూలైన్ లో
     ఆత్మహత్యలా ?, హత్యలా

    ఆత్మహత్యలా ?, హత్యలా

    గ్రౌండ్ ఫ్లోర్ లో ఫ్యాన్ కు అర్దం తాడు, బెడ్ మీద శవమైన డబ్బింగ్ ఆర్టిస్టు రూబీ మెడకు అర్దం తాడు ఉందని పోలీసులు అన్నారు. రూబీ శవం కిందకు ఎవరు దించారు ?, సునీల్ ప్రియురాలు రూబీ శవం కిందకు దించిన తరువాత సునీల్ ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయం కచ్చితంగా తెలీడం లేదని పోలీసులు అంటున్నారు. రూబీ, సునీల్ ఆత్మహత్యలు చేసుకున్నారా ?, లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. పర్యాటక కేంద్రం అయిన అల్పజు ప్రాంతంలో ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్టు రూబీ, ఆమె ప్రియుడు సునీల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+