Lovers: మైనర్ ప్రేమికులు ఎస్కేప్, అమ్మాయి తండ్రి ఏం చేశాడంటే ?, సినిమా స్టోరీ చెప్పిన పోలీసులు !

బెంగళూరు/మండ్య: ఒకే ఊరిలో నివాసం ఉంటున్న మైనర్ అమ్మాయి, మైనర్ అబ్బాయికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. రానురాను ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరూ మైనర్లు కావడంతో వాళ్ల పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. తెలిసీతెలియని వయసులో ఆవేశంతో ఇంటి నుంచి పారిపోయిన ప్రేమికులు అడ్రస్ లేకుండా పోయారు.

కూతురు చేసిన పనికి ఆవేశంలో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని మండ్య జిల్లాలోని కేఆర్ పేట్ తాలుకాలోని బాచహళ్ళి గ్రామంలో రవి (47) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రవి కుమార్తె, అదే గ్రామంలోల నివాసం ఉంటున్న ఓ మైనర్ అబ్బాయికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉండటంతో రానురాను ఇద్దరూ ప్రేమించుకున్నారు.

Lovers: Daughter runs away with boyfriend, father commits suicide near Mandya in Karnataka.

ఇద్దరూ మైనర్లు కావడంతో వాళ్ల పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. తెలిసీతెలియని వయసులో ఆవేశంతో ఇంటి నుంచి పారిపోయిన ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయారు. మా కూతురు కనపడటం లేదని రవి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు పెట్టి ఐదు రోజులు అయినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.

ఇదే విషయంలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి విసిగిపోయిన అమ్మాయి తండ్రి రవి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకం రేపింది. మైనర్ ప్రేమికులు లేచిపోవడంతో ఆవేదనతో అమ్మాయి తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు చలించిపోయారు. అయితే అమ్మాయి కోసం మేము గాలిస్తున్న సమయంలోనే రవి ఆవేశంలో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+