Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lovers: ప్రియురాలికి అంబులెన్స్ డ్రైవర్ తో ?, పక్కాప్లాన్ తో చంపేసి సూసైడ్, కాలేజ్ ప్రియుడి స్కెచ్ !

బెంగళూరు/ శివమొగ్గ: ఒకే ఊరిలో కాలేజ్ లో చదువుతున్న సమయంలో యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. కొన్ని సంవత్సరాల నుంచి కాలేజ్ అమ్మాయి, కాలేజ్ అబ్బాయి ప్రేమించుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్న యువతి అబ్బాయికి అన్ని రకాలుగా దగ్గర అయ్యింది. ఇద్దరు హద్దులు దాటి ప్రేమలో మునిగిపోయారని తెలిసింది. రానురాను ప్రియురాలు దూరం అవుతున్నదని ప్రియుడికి అనుమానం వచ్చింది. తనను ప్రేమిస్తున్న యువతి వేరే యువకుడిని ప్రేమిస్తోందని ప్రియుడికి తెలిసిపోయింది. పెళ్లి విషయంలో యువతి తప్పించుకుని కాలం గడపడానికి ప్రయత్నించింది. తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతి మోసం చేస్తోందని రగిలిపోయిన ప్రియుడు ఆమెను పక్కాస్కెచ్ ప్రకారం అటవి ప్రాంతంలోని నిర్జనప్రదేశంలోకి పిలుచుకుని వెళ్లాడు. అక్కడమాటా పెరిగిపోవడంతో ప్రియురాలిని చంపేసిన ప్రియుడు విషయం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలిని హత్య చేసిన చోట ప్రియుడు ఇంతకు ముందు ప్రియురాలి విషయంలో ఏమి జరిగింది. ప్రేమించిన తరువాత తన ప్రియురాలు తనను మోసం చేసి అంబులెన్స్ డ్రైవర్ తో తిరిగిందని ప్రియుడు డెత్ నోట్ రాసి పెట్టడం కలకలం రేపింది.

కాలేజ్ ప్రేమికులు

కాలేజ్ ప్రేమికులు

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హోసనగరకు చెందిన శివమూర్తి (22) అనే యువకుడు రిప్పన్ పేట ప్రభుత్వ కాలేజ్ లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. సాగర్ తాలుకాలోని భానుకుళి గ్రామానికి చెందిన కవిత (22) రిబ్బన్ పేటలోని ఓ కాలేజ్ లో ఇంటర్ పూర్తి చేసి తరువాత అదే ఊరిలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో నర్సింగ్ చదువుతోంది.

కొన్ని సంవత్సరాల క్రితం

కొన్ని సంవత్సరాల క్రితం

రిబ్బన్ పేట్ లో చదువుతున్న శివమూర్తి, కవితకు కొన్ని సంవత్సరాల క్రితం పరిచయం అయ్యింది. ఒకే ఊరిలో కాలేజ్ లో చదువుతున్న సమయంలో కవిత, శివమూర్తి ముందే పరిచయం ఉండటంతో వారు ప్రతిరోజూ కలిసేవారు. కొన్ని సంవత్సరాల నుంచి కాలేజ్ అమ్మాయి కవిత, కాలేజ్ అబ్బాయి శివకుమార్ ప్రేమించుకుంటున్నారు.

హాస్టల్ లో ఉంటూ హద్దులు దాటిన ప్రియురాలు

హాస్టల్ లో ఉంటూ హద్దులు దాటిన ప్రియురాలు

సొంత గ్రామం నుంచి ప్రతిరోజు వచ్చి వెళ్లడానికి కష్టంగా ఉండటంతో కవిత మొదట రిబ్బన్ పేట్ లోని ఆమె బంధువుల ఇంట్లో ఉంటూ ఇంటర్ పూర్తి చేసింది. తరువాత నర్సింగ్ కాలేజ్ లో చేరిన కవిత హాస్టల్ లో ఉంటున్నది. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్న కవిత ఆమె ప్రియుడు శివమూర్తికి అన్ని రకాలుగా దగ్గర అయ్యింది. ఇదే సమయంలో ప్రియురాలు కవిత, శివమూర్తి ఇద్దరూ హద్దులు దాటి ప్రేమలో మునిగిపోయారని తెలిసింది.

ప్రియురాలికి మరో కొత్త ప్రియుడు

ప్రియురాలికి మరో కొత్త ప్రియుడు

రానురాను ప్రియురాలు కవిత తనకు దూరం అవుతున్నదని ఆమె ప్రియుడు శివమూర్తికి అనుమానం వచ్చింది. తనను ప్రేమిస్తున్న యువతి కవిత భద్రావతికి చెందిన అంబులెన్స్ డ్రైవర్ ను కూడా ప్రేమిస్తోందని, అతనితో కలిసి ఎక్కడంటే అక్కడ తిరుగుతోందని ప్రియుడు శివమూర్తికి తెలిసిపోయింది. పెళ్లి విషయంలో కవిత తప్పించుకుని కాలం గడపడానికి ప్రయత్నించింది. తాను 7 సంవత్సరాల నుంచి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కవిత తనను మోసం చేస్తోందని ఆమె ప్రియుడు శివమూర్తి రగిలిపోయాడు.

అడవిలో స్కెచ్ వేసిన ప్రియుడు

అడవిలో స్కెచ్ వేసిన ప్రియుడు


ప్రియురాలు కవితకు ఫోన్ చేసిన శివమూర్తి నీతో మాట్లాడలని ఆమెకు చెప్పాడు. పక్కాస్కెచ్ ప్రకారం రిప్పన్ పేట్ సమీపంలోని నెరలిగె అటవి ప్రాంతంలోని నిర్జనప్రదేశంలోకి కవితను పిలుచుకుని వెళ్లాడు. తరువాత అక్కడ పెళ్లి విషయం, అంబులెన్స్ డ్రైవర్ విషయంలో కవితతో గొడవ పెట్టుకున్న శివమూర్తి రగిలిపోయాడు. అక్కడ కవిత, శివమూర్తి మద్య మాటామాటా పెరిగిపోయింది.

 ప్రియురాలిని వేల్ తో చంపేశాడు

ప్రియురాలిని వేల్ తో చంపేశాడు


అటవి ప్రాంతంలో ఎవ్వరూ లేకపోవడంతో శివమూర్తి రగిలిపోయాడు. తరువాత కవిత వేసుకున్న పంజాబి డ్రెస్ వేల్ తోనే ఆమె గొంతు బిగించి చంపేశాడు. తరువాత శివమూర్తి అక్కడే పురుగుల మందు సేవించాడు. విషం సేవించిన ప్రియుడు శివమూర్తి అతని ఫ్రెండ్ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. స్నేహితుడు వెళ్లి శివమూర్తిని శివమొగ్గలోని మెగ్గాస్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై శివమూర్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

Recommended Video

    VIRAL: Elephant Arrest తల్లితో పాటు పిల్ల ఏనుగు కూడా Case Filed | Ex MLA
     ప్రియుడి డెత్ నోట్ కలకలం

    ప్రియుడి డెత్ నోట్ కలకలం

    ప్రియురాలు కవితను హత్య చేసిన చోట ఆమె ప్రియుడు శివమూర్తి ఇంతకు ముందు ప్రియురాలి విషయంలో ఏమి జరిగింది. 7 సంవత్సరాలు ప్రేమించిన తరువాత తన ప్రియురాలు కవిత తనను మోసం చేసిందని, భద్రావతికి చెందిన అంబులెన్స్ డ్రైవర్ తో తిరిగిందని, తాను మోసపోయానని ప్రియుడు శివమూర్తి డెత్ నోట్ రాసి పెట్టడం కలకలం రేపింది.

    కాలేజ్ అమ్మాయి కవితను శివమూర్తి చాలా సంవత్సరాలుగా గాడంగా ప్రేమిస్తున్నాడని, ఆమెను వివాహం చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండాలని చాల కలలుకన్నాడని, పెళ్లికి అతని కుటుంబ సభ్యుల అంగీకారం తీసుకోవాలని ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేశాడని అతని స్నేహితులు అంటున్నారు. అయితే మా అమ్మాయిని నమ్మించి మోసం చేసి పిలుచుకుని వెళ్లి చంపేశాడని కవిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కవితను హత్య చేసి శివమూర్తి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ప్రేమ జంట ఇలా కావడానికి కారణం అయిన అంబులెన్స్ డ్రైవర్ మాయం అయ్యాడని సమాచారం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+