Lovers: ప్రియుడు మోసం చేశాడని ఫస్ట్ నైట్ రోజు ప్రియురాలు ఏం చేసిందంటే ?, భార్యకు కత్తిరించి, కళ్లల్లో !
పాట్నా/ నలంద: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రియురాలి మీద మోజు తీరిపోయిన ప్రియుడు తల్లిదండ్రులు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని హ్యాపీగా ఇంటికి చేరుకున్న ప్రియుడు అదే రోజు రాత్రి ఫస్ట్ నైట్ చేసుకోవడానికి సిద్దం అయ్యాడు. ఫస్ట్ నైట్ రోజు ప్రియురాలు బెడ్ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన ప్రియుడిని పెళ్లి చేసుకున్న అతని భార్యను చూసి రగిలిపోయింది. పదునైన కత్తెర తీసుకెళ్లి ప్రియుడి భార్య పొడవైన జుట్టు కత్తిరించింది. అంతే కాకుండా తన ప్రియుడితో ఎంజాయ్ చేస్తావా అంటూ నవవధువు కళ్లలో ఫెవికిక్ లాంటి జిగట పదార్థం పోసేయడంతో అమె కంటి చూపు పూర్తిగా పోయే పరిస్థితి రావడం కలకలం రేపింది.

లవర్స్ అదుర్స్
బీహార్ లోని మోరా తలాబ్ గ్రామంలో గోపాల్ రామ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇదే గ్రామంలో నివాసం ఉంటున్న రష్మి ( పేరు మార్చడం జరిగింది), గోపాల్ రామ్ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని, హాయిగా కాపుం చేద్దామని గోపాల్ రామ్, రష్మి నిర్ణయించారు. గోపాల్ రామ్, రష్మి ప్రేమించుకున్న విషయం ఇద్దరి స్నేహితులకు తెలుసు. గోపాల్ రామ్, రష్మిని సూపర్ లవర్స్ అంటూ వారి స్నేహితులు అనే వాళ్లు.

ఎంజాయ్ చేసి హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు
ప్రియుడు గోపాల్ రామ్ పెళ్లి చేసుకుంటాడని గుడ్డిగా నమ్మిన రష్మి అతనికి శారీరకంగా దగ్గర అయ్యింది. గోపాల్ వర్మ, రష్మి ఇంతకాలం ఎంజాయ్ చేశారు. అయితే తాను నిన్ను పెళ్లి చేసుకోలేనని గోపాల్ రామ్ చేతులు ఎత్తేశాడు. తల్లిదండ్రులు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆస్తితో పాటు అంతస్తులు కలిసి వస్తాయని గోపాల్ రామ్ డిసైడ్ అయ్యాడు.

ప్రియుడి పెళ్లి.... రగిలిపోయిన లవర్
తల్లిదండ్రులు చూపించిన అమ్మాయితో పెళ్లి కుమార్తె ఊరిలో డిసెంబర్ 1వ తేదీన గోపాల్ రామ్ పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ గోపాల్ రామ్, అతను పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఆశీర్వదించారు. తనను మోసం చేసిన ప్రియుడు గోపాల్ రామ్ కు, తన విషయం తెలిసి కూడా అతని భార్యకు సరైన బుద్ది చెప్పాలని రష్మి రగిలిపోయింది.

ఫస్ట్ నైట్ బెడ్ రూమ్ లో షాక్
గోపాల్ రామ్ చెల్లెలు, రష్మి స్నేహితులు. పెళ్లి చేసుకున్న గోపాల్ రామ్ అతని భార్యను పిలుచుకుని బంధువులతో కలిసి పెళ్లి జరిగిన రోజు సాయంత్రం సొంత గ్రామానికి చేరుకున్నారు. గోపాల్ రామ్ ఇంటికి వెళ్లిన రష్మి నవదంపతులకు మాట్లాడటంతో ఆమెకు కోపం లేదని బంధువులు అనుకున్నారు. అదే రోజు రాత్రి గోపాల్ రామ్ ఫస్ట్ నైట్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. అర్దరాత్రి ఊహించని విధంగా రష్మి గోపాల్ రామ్ ఫస్ట్ నైట్ జరుగుతున్న బెడ్ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

నవ వధువు జుట్టు కత్తిరించి, కళ్లలో ఫెవికిక్ పోసింది
గోపాల్ రామ్, అతని భార్య బాగా అలిసిపోయి నిద్రపోయారు. అదే సమయంలో బెడ్ రూమ్ లోకి వెళ్లిన రష్మి తన ప్రియుడు పెళ్లి చేసుకున్న నవవధువు జుట్టును పదునైన కత్తెర తీసుకుని పూర్తిగా కత్తిరించింది. వెంటనే రష్మి వెంట తీసుకెళ్లిన ఫెవికిక్ లాంటి జిగురు తీసుకుని నవవధువు కళ్లల్లో పోసేసింది. కళ్లలో మంటకు నవవధువు గట్టిగా కేకలు వెయ్యడంతో నిద్రపోతున్న ఆమె బంధువులు మేలుకున్నారు.

ప్రియురాలికి దేహశుద్ది
నవవధువు కళ్లలో జిగురు పోసిన రష్మి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. విషయం గుర్తించిన నవవధువు బంధువులు రష్మిని పట్టుకుని చితకబాదేసి ఊరిమద్యలో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రష్మిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని నలంద సబ్ డివిజన్ పోలీసు అధికారి మోహమ్మద్ సబిలి నమోళి మీడియాకు చెప్పారు.
Recommended Video

కంటిచూపు రావడం చాలా కష్టం
నవ వధువు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నా ఆమె కంటి చూపు పూర్తిగా పోయే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఇంత జరిగినా రష్మికి ఏమాత్రం భయం కానీ, దిగులు కానీ లేదని, కేవలం ప్రియుడు గోపాల్ రామ్ కు బుద్ది చెప్పాలనే ఇలా చేశానని అంటోందని పోలీసు అధికారులు తెలిపారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications