Lady: ప్రియుడితో బస్సు ఎక్కేసిన ప్రియురాలు, అడ్డుకున్న హిందూ సంఘాలు, భర్త ఎంట్రీతో ట్విస్ట్ !
బెంగళూరు/ మంగళూరు: ఒకే ఏరియాలో ఉన్న యువతికి, యువకుడికి పరిచయం అయ్యింది, యువతి, యువకుడు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు. ఏడాది పాటు యువతి, యువకుడు ప్రేమించుకుని పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకున్నారు. కొంతకాలం తరువాత యువతికి వేరే యువకుడితో పెళ్లి జరిగిపోయింది. ప్రియురాలు భర్తతో కలిసి వేరే సిటీకి వెళ్లి అక్కడ అతనితో కాపురం చేస్తోంది. వివాహం చేసుకున్న మహిళ ప్రియుడిని మాత్రం మరిచిపోలేదు. భర్తతో కాపురం చేస్తున్న ప్రియురాలి కోసం ప్రియుడు వచ్చాడు. ప్రియుడు, ప్రియురాలు కలిసి బస్సులో వేరే ప్రాంతానికి బయలుదేరారు. ఆ సమయంలో హిందూ, ముస్లీం మతాలకు చెందిన యువతి, యువకుడు లేచిపోతున్నారని.
ఇది లవ్ జీహాద్ అనే అనుమానంతో హిందూ సంఘాల కార్యకర్తలు వారిని బలవంతంగా బస్సు దింపి సవాలక్ష ప్రశ్నలు వేశారు. ప్రియుడు, వివాహిత మహిళ పొంతనలేని సమాచారం ఇవ్వడంతో ఇద్దరిని పోలీసులకు పట్టించారు. పోలీసులు మహిళ భర్త, కుటుంబ సభ్యులను పిలిపించి విచారణ చేశారు. ఇద్దరి మతాలు ఒక్కటే అయినా ఆమెకు ఇప్పటికే పెళ్లి అయిపోయిందని తెలుసుకున్న హిందూ సంఘాల నాయకులు షాక్ అయ్యారు. ఏదో అనుకుని ప్రియుడితో బయలుదేరిన వివాహిత మహిళ మ్యాటర్ భర్తకు, కుటుంబ సభ్యులకు, ఊరందరికి తెలిసిపోవడంతో ఆమె బిత్తరపోయింది. ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యాలని వెళ్లిన యువకుడు ఇప్పుడు పోలీసులకు చిక్కిపోయాడు.

బీహార్ యువకుడు, మంగళూరు అమ్మాయి
కర్ణాటకలోని మంగళూరు నగరంలోని మిజారికి చెందిన హిందూ అమ్మాయి రూపా (పేరు మార్చడం జరిగింది) ముంబాయిలో ఉంటున్న సమయంలో ముంబాయిలోనే నివాసం ఉంటున్న బీహార్ కు చెందిన బాబు (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం పాటు రూపా, బాబు మాట్లాడుకుంటూ కలిసిమెలసి తిరిగారు.

పెళ్లికి ముందే ?
ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న రూపా, బాబుల పరిచయం చనువుగా మారింది. రూపా, బాబు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు అయినా నిత్యం కలుసుకునేవాళ్లు. ఏడాది పాటు బాబు, రూపా ప్రేమించుకుని పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకున్నారు. ముంబాయిలోనే రూపా, బాబు కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేశారు.

భర్తతో బెంగళూరులో ఉంటున్న ప్రియురాలు
రెండు సంవత్సరాల క్రితం రూపాకు బెంగళూరులో నివాసం ఉంటున్న మరో యువకుడితో పెళ్లి జరిగిపోయింది. వివాహం చేసుకున్న రూపా ముంబాయి నుంచి బెంగళూరులో ఉంటున్న భర్త దగ్గరకు వెళ్లిపోయి అక్కడే అతనితో కాపురం చేస్తోంది. వివాహం చేసుకున్న రూపా ఆమె ప్రియుడు బాబును మాత్రం మరిచిపోలేదు. భర్తతో కాపురం చేస్తున్న ప్రియురాలు రూపా కోసం ఆమె ప్రియుడు బాబు అప్పుడప్పుడు వెళ్లి వస్తున్నాడు.

హిందూ సంఘాలకు అనుమానం
కొన్ని రోజుల క్రితం రూపా మంగళూరులోని పుట్టింటికి వెళ్లింది. శుక్రవారం రూపా ప్రియుడు బాబు మంగళూరు వెళ్లాడు. శనివారం రూపా, ఆమె ప్రియుడు బాబు మూడబిద్రి నుంచి ఓ ప్రైవేటు బస్సులో మంగళూరు బయలుదేరారు. ఆ సమయంలో హిందూ, ముస్లీం మతాలకు చెందిన యువతి, యువకుడు లేచిపోతున్నారని. ఇది లవ్ జీహాద్ అనే అనుమానంతో హిందూ సంఘాల కార్యకర్తలు బాబు, రూపాను బలవంతంగా గురుపుర ప్రాంతంలో బస్సు దింపి సవాలక్ష ప్రశ్నలు వేశారు.

భార్య మ్యాటర్ మొత్తం లీక్
ప్రియుడు బాబు, వివాహిత మహిళ రూపా పొంతనలేని సమాచారం ఇవ్వడంతో హిందూ సంఘాల కార్యకర్తలు వారిద్దరిని మంగళూరులోని బజ్పే పోలీసులకు పట్టించారు. మంగళూరు పోలీసులు రూపా భర్త, కుటుంబ సభ్యులను పిలిపించి విచారణ చేశారు. ఆ సమయంలోనే రూపాకు వేరే వ్యక్తితో వివాహం అయ్యిందనే విషయం బయటకు వచ్చింది.

అందరికి షాక్
రూపా, బాబుల మతాలు ఒక్కటే అయినా ఆమెకు ఇప్పటికే వేరే వ్యక్తితో పెళ్లి అయిపోయిందని తెలుసుకున్న హిందూ సంఘాల నాయకులు షాక్ అయ్యారు. ఏదో అనుకుని ప్రియుడు బాబుతో బయలుదేరిన వివాహిత మహిళ రూపా మ్యాటర్ భర్తకు, కుటుంబ సభ్యులకు, ఊరందరికి తెలిసిపోవడంతో ఆమె ఏం చెయ్యలో తెలీక బిత్తరపోయింది. ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యాలని వెళ్లిన యువకుడు ఇప్పుడు మంగళూరు పోలీసులకు చిక్కిపోయి తల పట్టుకున్నాడు.












Click it and Unblock the Notifications