Lovers: కాలేజ్ అమ్మాయి సీక్రేట్ లవ్ మ్యారేజ్, మూడు నెలలు కాపురం,క్యాస్ట్ ఫీలింగ్, భర్త దెబ్బతో !
చెన్నై/ కరూర్: కాలేజ్ లో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న యువతికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. రానురాను యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లికి మన పెద్దలు అంగీకరించని తెలుసుకున్న ప్రేమికులు మూడు నెలల క్రితం ఫ్రెండ్స్ సహాయంతో గుడిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తరువాత ప్రియుడి స్నేహితుడి ఇంటిలో రహస్యంగా కాపురం పెట్టి వారి ఇద్దరి కుటుంబ సభ్యులు, బంధువులకు కనపడకుండా జాగ్రత పడ్డారు. తరువాత ప్రియుడి కుటుంబ సభ్యులు ప్రేమికులు ఉంటున్న ఇంటిని పసిగట్టి అక్కడికి వెళ్లారు. ప్రియుడిని పక్కకు లాగిన అతని కుటుంబ సభ్యులు కొన్ని గంటల పాటు వారికి బ్రైన్ వాష్ చేశారు. ఇదే సమయంలో తక్కువ కులం అయ్మాయితో నేనే కాపురం చెయ్యనని, నేను చేసుకుంది పెళ్లే కాదని ప్రియుడు రివర్స్ కావడంతో ప్రియురాలు హడలిపోయింది.

నర్సింగ్ చదువుతున్న యువతి
తమిళనాడులోని కరూర్ జిల్లాలోని చిందామట్టి ప్రాంతంలో రేవతి అనే యువతి నివాసం ఉంటున్నది. కాలేజ్ లో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న రేవతికి ధరంగంపట్టి సమీపంలోని సేవాలుయార్ ప్రాంతంలో నివాసం ఉంటున్న శశికుమార్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. రానురాను శశికుమార్, రేవతి ప్రేమించుకున్నారు.

గుడిలో సీక్రేట్ గా పెళ్లి
పెళ్లికి మన పెద్దలు అంగీకరించని తెలుసుకున్న ప్రేమికులు శశికుమార్, రేవతి మూడు నెలల క్రితం ఫ్రెండ్స్ సహాయంతో గుడిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తరువాత ప్రియుడు శశికుమార్ స్నేహితుడి కోయంబత్తూరులోని ఇంటిలో రహస్యంగా కాపురం పెట్టి వారి ఇద్దరి కుటుంబ సభ్యులు, బంధువులకు కనపడకుండా జాగ్రత పడ్డారు.

అబ్బాయి ఫ్యామిలీకి విపరీతమైన క్యాస్ట్ ఫీలింగ్
రేవతి తరువాత నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నానని ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. మూడు నెలల నుంచి శశికుమార్ కోసం అతని కుటుంబ సభ్యులు గాలిస్తూనే ఉన్నారు. తరువాత శశికుమార్ కుటుంబ సభ్యులు ప్రేమికులు ఉంటున్న కోంయబత్తూరులోని ఇంటిని పసిగట్టి అక్కడికి వెళ్లారు.

తక్కువ కులం పెళ్లామ్ వద్దని భర్త రివర్స్
ప్రియుడు శశికుమార్ ను పక్కకు లాగిన అతని కుటుంబ సభ్యులు కొన్ని గంటల పాటు అతనికి బ్రైన్ వాష్ చేశారు. తక్కువ కులం అమ్మయి రేవతితో తిరిగినా,, ఆమెను పెళ్లి చేసుకుని కాపురం చేసినా మన కులం వారు పట్టించుకోరని, తరువాత మన పరస్థితి దారుణంగా ఉంటుందని భర్త శశికుమార్ కు అతని కుటుంబ సభ్యులు మాయమాటలు చెప్పారు.

కులం గురించి తెలీకుండా పెళ్లి చేసుకున్నా
తాను తక్కువ కులం అమ్మాయిని తెలీక పెళ్లి చేసుకున్నానని, ఈ పెళ్లి రద్దు చేస్తున్నానని శశికుమార్ రివర్స్ అయ్యాడు. మండిపడిన రేవతి కులం పేరుతో తను త భర్త మోసం చేశాడని, త్వరలో అతికి బుద్ది చెబుతామని పోలీసు అధికారులు అంటున్నారు. పెళ్లి చేసుకున్న భర్త శశికుమార్ రివర్స్ కావడంతో తనకు న్యాయం చెయ్యాలని రేవతి, ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.












Click it and Unblock the Notifications