Lovers: ఆవేశంలో ఉరి వేసుకున్న ప్రియురాలు, కాలేజ్ 8వ అంతస్తు నుంచి దూకిన ప్రియుడు, ఫోన్ కాల్ తో !
పాట్నా: చిన్నప్పటి కలిసి చదువుకున్న అమ్మాయి, అబ్బాయి కాలేజ్ లో ఇంటర్ వరకు మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. ఇంటర్ పూర్తి అయిన తరువాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. ప్రియుడు ఇంజనీరింగ్ చెయ్యడానికి వేరే సిటీకి వెళ్లాడు. ఇదే సమయంలో ప్రియురాలు ఉన్నత చదువుల కోసం వెళ్లింది. వేర్వేరు నగరాల్లో ఉంటున్న ప్రేమికులు ప్రతిరోజు ఫోన్లు చేసుకుని గంటలు గంటలు మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రేమికుల మద్య ఇటీవల గొడవలు మొదలైనాయి. ప్రేమికులు పోట్లాడుకోవడం, మళ్లీ కలిసిపోవడం చేస్తున్నారు. ఇటీవల ఇద్దరి మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ప్రేమికులను కామన్ ఫ్రెండ్ రాజీ చెయ్యడానికి ప్రయత్నించింది. ముగ్గురు ఫోన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో నీదే తప్పు అంటే లేదు నీదే తప్పు అంటూ ప్రేమికులు ఫోన్ లోనే గొడవ పడ్డారు. ప్రియుడికి కోపం వచ్చి ఫోన్ కట్ చేసేశాడు. ప్రియుడితో మాట్లాడాలని ప్రియురాలు అతనికి పదేపదే ఫోన్ చేసింది. అయితే ప్రియుడు ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో ఆవేశంలో ప్రియురాలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరుసటి రోజు ప్రియురాలు ఆత్మహత్య చేసుకుందని తెలిసిన ప్రియుడు 8వ అంతస్తు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
బీహార్ లోని ముజఫర్ పురలోని మోహమ్మద్ పురలో అంజలి జైశ్వాల్ (23) అనే యువతి నివాసం ఉంటున్నారు. నీమ్ చౌక్ శంకరపురిలో వివేక్ కుమార్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చిన్నప్పటి కలిసి చదువుకున్న అంజలి, వివేక్ కాలేజ్ లో ఇంటర్ వరకు మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. ఇంటర్ పూర్తి అయిన తరువాత వివేక్, అంజలి ఇద్దరూ ప్రేమించుకున్నారు.

వేర్వేరు నగరాల్లో ప్రేమికులు
ప్రియుడు వివేక్ ఇంజనీరింగ్ చెయ్యడానికి జైపూర్ సిటీకి వెళ్లాడు. ఇదే సమయంలో ప్రియురాలు అంజలి ఉన్నత చదువుల కోసం వెళ్లింది. వేర్వేరు నగరాల్లో ఉంటున్న ప్రేమికులు వివేక్, అంజలి ప్రతిరోజు ఫోన్లు చేసుకుని గంటలు గంటలు మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రేమికులు అంజలి, వివేక్ ల మద్య ఇటీవల గొడవలు మొదలైనాయి.

ఫోన్ కట్ చేసిన ప్రియుడు
ప్రేమికులు అంజలి, వివేక్ పోట్లాడుకోవడం, మళ్లీ కలిసిపోవడం చేస్తున్నారు. ఇటీవల ఇద్దరి మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ప్రేమికులు అంజలి, వివేక్ కామన్ ఫ్రెండ్ రాజీ చెయ్యడానికి ప్రయత్నించింది. ముగ్గురు ఫోన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో నీదే తప్పు అంటే లేదు నీదే తప్పు అంటూ ప్రేమికులు వివేక్, అంజలి ఫోన్ లోనే గొడవ పడ్డారు. ఆ సమయంలో వివేక్ ఒక్కసారిగా కాన్ఫరెన్స్ ఫోన్ కాల్ కట్ చేశాడు.

ఉరి వేసుకున్న ప్రియురాలు..... 8వ అంతస్తు నుంచి దూకిన ప్రియుడు
ఫోన్ కట్ చేసిన వివేక్ మీద అంజలి ఇంకా రగిలిపోయింది. ప్రియుడు వివేక్ తో మాట్లాడాలని అతపి ప్రియురాలు అంజలి అతనికి పదేపదే ఫోన్ చేసింది. అయితే ప్రియుడు వివేక్ ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో ఆవేశంలో ప్రియురాలు అంజలి ముజఫర్ పుర్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరుసటి రోజు ప్రియురాలు అంజలి ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న ప్రియుడు వివేక్ జైపూర్ లో 8వ అంతస్తు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న విషయాలకు గొడవ పడుతున్న ప్రేమికులు చివరికి ఆత్మహత్యలు చేసుకోవడంతో ఇరు కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications