బండీపుర టైగర్ సఫారి: కారులో రాసలీలలు (ఫోటోలు)

చామరాజనగర (కర్ణాటక): బండీపుర టైగర్ సఫారీ సమీపంలోని నిషేధిత ప్రాంతంలోకి వెళ్లిన ప్రేమికులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి మీద కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు.

చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలుకా బండీపుర అటవి ప్రాంతంలోని టైగర్ సఫారి సమీపంలోని నిషేధిత అటవి ప్రాంతంలోకి హాసన్ కు చెందిన రోషన్, అతని స్నేహితురాలు ప్రవేశించారు.

తరువాత కారులో రాసలీలు సాగిస్తూ ప్రపంచాన్నే మరిచిపోయారు. చామరాజనగర జిల్లా ఫారెస్టు అధికారి ఎన్ఎం. నవీన్ కుమార్ బండీపురలో అడవి దొంగలను పట్టుకోవడానికి తన సిబ్బందితో కలిసి వెళ్లిన సమయంలో విషయం గుర్తించారు.

అక్రమంగా చొరబడ్డారు

అక్రమంగా చొరబడ్డారు

నిషేదిత అటవి ప్రాంతంలో కారు నిలిపి ఉన్న విషయం గుర్తించారు. అక్కడికి వెళ్లి చూడగా షాక్ కు గురైనారు.

కారులోనే రాసలీలలు

కారులోనే రాసలీలలు

రోషన్ తన స్నేహితురాలితో కలిసి రాసలీలలలో మునిగి ఉన్న విషయం గుర్తించిన అటవి శాఖ అధికారులు వెంటనే బయటకు రావాలని వారిని హెచ్చరించారు.

కారు సీజ్

కారు సీజ్

నిషేధిత అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించిన కేఏ 13, ఎన్.4604 కారును స్వాధీనం చేసుకున్నామని ఫారెస్టు అధికారి నవీన్ కుమార్ చెప్పారు.

కారులోనే బరితెగించారు

కారులోనే బరితెగించారు

కారులోనే బరితెగించి సరససల్లాపాలలో మునిగిపోయారని, జంతువులు వచ్చి దాడి చేసి ఉంటే ఎవరు భాద్యత వహిస్తారని అటవీ శాఖ అధికారులు అంటున్నారు.

కేసు నమోదు

కేసు నమోదు

రోషన్, అతని స్నేహితురాలి మీద అటవి ప్రాంతంలో అక్రమంగా చొరబడ్డారని కేసు నమోదు చేశామని అధికారులు చెప్పారు.

 గట్టి నిఘా ఉన్నా వెలుతున్నారు

గట్టి నిఘా ఉన్నా వెలుతున్నారు

బండీపుర టైగర్ సఫారీ పరిసర ప్రాంతాల్లో అటవీ శాఖ సిబ్బంది నిత్యం గస్తీ తిరుగుతుంటారు. అయినా ఇలా ప్రేమికులు అక్రమంగా ప్రవేశించి ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారని అటవీ శాఖ అధికారులు చెప్పారు.

నిత్యం సినిమా షూటింగ్ లు

నిత్యం సినిమా షూటింగ్ లు

బండీపుర అటవీ ప్రాంతంలో వివిధ బాషల సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి. కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఈ బండీపుర ఫారెస్టు ఉంది. నిత్యం పులులు, ఏనుగులు, జింకలు సంచరిస్తుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+