బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lovers: ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని విషం తాగిన ప్రియుడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని రివర్స్ కేసు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ హాసన్: ఒకే ఊరిలో నివాసం ఉంటున్న యవతి, యవకుడికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఇద్దరూ ఒకే కులానికి చెందిన వారు. కొన్ని సంవత్సరాల నుంచి యువతి, యువకుడు ప్రేమించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ప్రియురాలి పుట్టినరోజు సందర్బంగా ఆమెతో కేక్ కట్ చేయిస్తున్న ప్రియుడు తరువాత అతని ఫ్రెండ్స్ తో కలిసి మందు పార్టీ చేసుకుంటున్నాడు. అయితే ఇటీవల పుట్టిన రోజు అతని ప్రియురాలు రాకుండా హ్యాండ్ ఇచ్చింది. తన ప్రియురాలు తనను మోసం చేస్తోందని, వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యిందని ప్రియుడు రగిలిపోయాడు. ప్రియురాలిని మరిచిపోలేని ప్రియుడు విషం తాగేశాడు. మా అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తూ పెళ్లి చేసుకోవడానికి కేటుగాడు ప్రయత్నిస్తున్నాడని అమ్మాయి కుటుంబ సభ్యులు ప్రియుడి మీద రివర్స్ కేసు పెట్టారు. ఏదో చెయ్యాలని అనుకున్న ప్రియుడు చివరికి ప్రాణం మీదకు తెచ్చుకుని ఆసుపత్రిపాలైనాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియుడు కోలుకుంటే అతన్ని విచారణ చెయ్యాలని పోలీసులు సిద్దం కావడం, ఇంతకాలం ప్రేమించిన అమ్మాయి సైలెంట్ గా ఉండిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Wife: నీ ముఖం చూడను, నీతో కాపురం చెయ్యను, తేల్చి చెప్పిన భార్య, అత్తారింటి ముందే విషం తాగిన భర్త !Wife: నీ ముఖం చూడను, నీతో కాపురం చెయ్యను, తేల్చి చెప్పిన భార్య, అత్తారింటి ముందే విషం తాగిన భర్త !

చిన్ననాటి స్నేహితులు

చిన్ననాటి స్నేహితులు

కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని అరసికెరె తాలుకా గండసిలో జీవిత్ (29) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. గండసిలోనే నివాసం ఉంటున్న సుధా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి, జీవిత్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. సుధా, జీవిత్ ఇద్దరూ ఒకే కులానికి చెందిన వారు. చిన్నప్పటి నుంచి జీవిత్, సుధా కలిసి చదువుకున్నారు.

9 ఏళ్ల నుంచి ప్రేమికులు

9 ఏళ్ల నుంచి ప్రేమికులు


9 సంవత్సరాల నుంచి జీవిత్, సుధా ప్రేమించుకుంటున్నారు. ఇంతకాలం టైమ్ చిక్కిప్పుడు సుధా ఆమె ప్రియుడు జీవిత్ తో కలిసి విహారయాత్రలకు, రహస్య ప్రాంతాలకు వెళ్లిందని సమాచారం. ప్రతి సంవత్సరం ప్రియురాలు సుధా పుట్టినరోజు సందర్బంగా ఆమెతో కేక్ కట్ చేయిస్తున్న ప్రియుడు జీవిత్ తరువాత సంతోషంతో అతని ఫ్రెండ్స్ తో కలిసి మందు పార్టీ చేసుకుంటున్నాడని సమాచారం.

బర్త్ డే రోజు కేక్ కట్ చెయ్యలేదని అనుమానం

బర్త్ డే రోజు కేక్ కట్ చెయ్యలేదని అనుమానం

ఇటీవల సుధా బర్త్ డే జరిగింది. ఎప్పటిలాగా జీవిత్ కేక్ తెప్పించి ప్రియురాలి కోసం గిఫ్ట్ తీసుకుని ఆమె కోసం ఎదురు చూశాడని తెలిసింది. అయితే కేక్ కట్ చెయ్యడానికి వెళ్లకుండా సుధా అప్పటి నుంచి ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుందని తెలిసింది. తన ప్రియురాలు సుధా తనకు దూరం అవుతోందని జీవిత్ కు అనుమానం మొదలైయ్యింది.

విషం తాగేసిన ప్రియుడు

విషం తాగేసిన ప్రియుడు

తన ప్రియురాలు సుధా తనను మోసం చేస్తోందని, ఆమె కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యిందని ప్రియుడు జీవిత్ రగిలిపోయాడు. ఎలాగైనా ప్రియురాలు సుధాను కలవాలని జీవిత్ అనేక ప్రయత్నాలు చేశాడు. ఇంతకాలం ప్రియురాలు సుధాను కలవడానికి సహాయం చేసిన స్నేహితులు కూడా జీవిత్ కు సహకరించలేదని తెలిసింది. ప్రియురాలిని మరిచిపోలేని ప్రియుడు జీవిత్ ఊరిలోనే విషం తాగేసి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు.

రివర్స్ కేసు పెట్టిన అమ్మాయి కుటుంబ సభ్యులు

రివర్స్ కేసు పెట్టిన అమ్మాయి కుటుంబ సభ్యులు

ఆత్మహత్యాయత్నం చేసిన జీవిత్ ను హాసన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మా అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తూ పెళ్లి చేసుకోవడానికి కేటుగాడు జీవిత్ ప్రయత్నిస్తున్నాడని ప్రియురాలి కుటుంబ సభ్యులు ప్రియుడి మీద రివర్స్ కేసు పెట్టారు. ఏదో చెయ్యాలని అనుకున్న ప్రియుడు జీవిత్ చివరికి ప్రాణం మీదకు తెచ్చుకుని ఆసుపత్రిపాలైనాడు. హాసన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియుడు కోలుకుంటే అతన్ని విచారణ చెయ్యాలని పోలీసులు సిద్దం కావడం, ఇంతకాలం ప్రేమించిన అమ్మాయి సైలెంట్ గా ఉండిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Lovers: Young man attempts suicide for cheating girlfriend near Hassan in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X