• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Lovers: ప్రియురాలికి ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని డౌట్ ?, రొమాన్స్ కు పిలిచి ఏం చేశాడంటే ?

|

చెన్నై/ పుదుచ్చేరి: కాలేజ్ కు వెళ్లి చక్కగా చదువుకుంటున్న కుమార్తెను చూసిన ఆమె తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పటిలాగే కాలేజ్ కు వెళ్లిన అమ్మాయి ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళనతో పోలీసులను ఆశ్రయించారు. నిర్జనప్రదేశంలో సంచిలో కట్టిన శవం కాలిపోతున్న విషయం తెలుసుకున్న పోలీసులు మంటలు అదుపుచేసి కాలిపోతున్న శవాన్ని బయటకు తీశారు. దారుణ హత్యకు గురైయ్యింది మా అమ్మాయి అని తెలుసుకున్న కాలేజ్ అమ్మాయి కుటుంబ సభ్యులు తల్లిడిల్లిపోయారు. కాలేజ్ అమ్మాయికి మరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే అనుమానంతో ఆమె ప్రియుడే దారుణంగా చంపేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

Illegal affair: కంపెనీ రెస్ట్ రూమ్ లో రెండో భార్య రొమాన్స్, భర్త ఎంట్రీతో సుత్తితో ఫినిష్, ఖర్మ !

ఇంటర్ అమ్మాయి

ఇంటర్ అమ్మాయి

పుదుచ్చేరిలోని పుతువై తిరుక్కనూర్ సమీపంలోని మార్కెట్ ప్రాంతంలో రామన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రామన్ కుమార్తె రాజశ్రీ (17) చేతరపట్టు ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాలేజ్ కు వెళ్లి చక్కగా చదువుకుంటున్న కుమార్తె రాజశ్రీని చూసి మా కష్టాలు త్వరలో తీరిపోతాయి అంటూ ఆమె తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు.

బస్సు రాలేదని చివరి ఫోన్ కాల్

బస్సు రాలేదని చివరి ఫోన్ కాల్

ఎప్పటిలాగే మంగళవారం ఉదయం రాజశ్రీ ఇంటి నుంచి కాలేజ్ కు వెళ్లింది. అదే రోజు మద్యాహ్నం 3 గంటల సమయంలో తల్లికి ఫోన్ చేసిన రాజశ్రీ తాను కాలేజ్ నుంచి బయటకు వచ్చానని, ఇంకా బస్సురాలేదని, బస్సు వచ్చిన వెంటనే ఊరికి వచ్చేస్తానని చెప్పింది. రాత్రి అయినా రాజశ్రీ ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనతో విల్లినూర్ పోలీసులను ఆశ్రయించారు.

 సార్...... అక్కడ ఏదో మంటల్లో ?

సార్...... అక్కడ ఏదో మంటల్లో ?

పొరయూర్ ప్రాంతంలో మంటల్లో ఓ సంచి కాలిపోతుందని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసు సూపరింటెండెంట్ రంగనాథన్, ఇన్స్ పెక్టర్ క్రిష్ణన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మంటల్లో కాలిపోతున్న సంచిలోపల యువతి శవం ఉందని గుర్తించిన పోలీసులు హడలిపోయారు. ఓ యువకుడు, అతనితో పాటు మరో కుర్రాడు బైక్ లో ఆ సంచిని తీసుకువచ్చి ఇక్కడ మంటల్లో విసిరేశారని ప్రత్యక్ష సాక్షలు పోలీసులకు చెప్పారు.

రాజశ్రీ దారుణ హత్య

రాజశ్రీ దారుణ హత్య

సంచిలో ఉన్నన శవాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. సంచిలో ఉన్న శవం రాజశ్రీది అని ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. రాజశ్రీ మొబైల్ ఫోన్ ఆధారంగా పోరూర్ పేట్ లో నివాసం ఉంటున్న ప్రదీప్ అలియాస్ ప్రదేశ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత మూడు సంవత్సరాల నుంచి ప్రదీప్, రాజశ్రీ ప్రేమించుకుంటున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ప్రియురాలి శీలం మీద అనుమానం

ప్రియురాలి శీలం మీద అనుమానం

రాజశ్రీ కాలేజ్ లో వేరే యువకుడితో చనువుగా ఉంటోందని, ఇదే విషయంలో చాలాసార్లు మా మద్య గొడవ జరిగిందని ప్రదీప్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. నిన్న నీతో ఏకాంతంగా మాట్లాడాలని రాజశ్రీని నిర్జనప్రదేశంలోకి పిలుచుకుని వెళ్లానని, ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో తాను రాజశ్రీ మీద దాడి చేశానని, ముక్కు, చెవుల్లో రక్తం ఎక్కువగా కారిపోయి రాజశ్రీ ప్రాణాలు విడిచిందని ప్రదీప్ పోలీసులకు చెప్పాడు.

 హత్య కేసులో 14 ఏళ్ల మైనర్

హత్య కేసులో 14 ఏళ్ల మైనర్

తన 14 ఏళ్ల తమ్ముడితో కలిసి తన ప్రియురాలు రాజశ్రీ శవాన్ని గోనే సంచిలో కట్టి ఇక్కడకు తీసుకు వచ్చి విసిరేశానని ప్రదీప్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. రాజశ్రీ హత్యకు సహకరించిన ప్రదీప్ 14 ఏళ్ల సోదరుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాలేజ్ లో స్నేహితుడితో మాట్లాడుతున్న యువతిని అనుమానించిన ఆమె ప్రియుడు ఇంతదారుణంగా హత్య చెయ్యడం పదుచ్చేరిలో కలకలం రేపింది.

English summary
Lovers: Youth stabbed his lover to death in Pondicherry. Police arrested him and searching his brother.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X