Loves: ఇంటి నుంచి స్కూల్ కు వెళ్లిన అమ్మాయి జంప్, ప్రియుడితో కలిసి విషం తాగింది !

చెన్నై/బెంగళూరు/క్రిష్ణగిరి: పక్కపక్క రాష్ట్రాల్లో రెండు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. రెండు కుటుంబాలు చాలా దగ్గర బంధువులు. రెండు కుటుంబాల్లో ఓ అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకున్నారు. బందువులు కావడంతో పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు అనుకున్నారు. లవర్స్ మ్యాటర్ తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రేమికులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కొంతకాలం పెద్దలకు భయపడిన ప్రేమికులు సైలెంట్ గా ఉండిపోయారు. ప్రేమికులు లేచిపోయారు. పోలీసులు ప్రేమికుల కోసం గాలించారు. ఇదే సమయంలో ప్రేమికులు పొలంలో విషం సేవించారు. స్థానికులు ప్రేమికులను ఆసుపత్రికి తరలించారు. ప్రియుడితో లేచిపోయిన స్కూల్ అమ్మాయి చికిత్స విఫలమై చనిపోవడం కలకలం రేపింది.

 తమిళనాడు, కర్ణాటకలో బంధువులు

తమిళనాడు, కర్ణాటకలో బంధువులు

తమిళనాడులోని క్రిష్ణగురి జిల్లాలో (బెంగళూరు గ్రామీణ జిల్లా పక్కన) హోసూరు సమీపంలో ఎరండపల్లి గ్రామంలో సౌందర్ రాజన్ అనే యువకుడి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. కర్ణాటకలోని కోలారు జిల్లాలోని వేమగల్ సమీపంలోని గ్రామంలో సౌందర్ రాజన్ సమీప బంధువులు నివాసం ఉంటున్నారు.

 మైనర్ అమ్మాయితో లవర్

మైనర్ అమ్మాయితో లవర్

కోలారు జిల్లాలో నివాసం ఉంటున్న సౌందర్ రాజన్ మామకు 9వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల కూతురు ఉంది. ప్రతిరోజు ఆ అమ్మాయి స్కూల్ కు వెళ్లి వస్తోంది. బంధువుల ఇంటికి వెలుతున్న సౌందర్ రాజన్ ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు. అమ్మాయి కూడా సౌందర్ రాజన్ ను ప్రేమించడం మొదలుపెట్టింది.

 లవర్స్ కు వార్నింగ్ ఇచ్చిన పెద్దలు

లవర్స్ కు వార్నింగ్ ఇచ్చిన పెద్దలు

సౌందర్ రాజన్, అతని ప్రియురాలు బందువులు కావడంతో పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు అనుకున్నారు. లవర్స్ మ్యాటర్ తెలుసుకున్న కుటుంబ సభ్యులు సౌందర్ రాజన్ తో పాటు మైనర్ అమ్మాయికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి బుద్దిగా ఉండాలని సలహా ఇచ్చారు. కొంతకాలం పెద్దలకు భయపడిన ప్రేమికులు సైలెంట్ గా ఉండిపోయారు.

 ప్రియుడితో లేచిపోయిన మైనర్ అమ్మాయి

ప్రియుడితో లేచిపోయిన మైనర్ అమ్మాయి

గత నెల 26వ తేదీన వేమగల్ వెళ్లిన సౌందర్ రాజన్ స్కూలుకు వెలుతున్న ప్రియురాలిని పిలుచుకుని పరారైనాడు. మరుసటి రోజు అమ్మాయి కుటుంబ సభ్యులు వేమగల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. పోలీసులు ప్రేమికుల కోసం గాలించారు. తమ కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకున్న సౌందర్ రాజన్, అతని ప్రియురాలు ఎరండపల్లి గ్రామం సమీపంలోని పొలంలో విషం తాగేశారు.

 ప్రియురాలి ప్రాణం పోయింది

ప్రియురాలి ప్రాణం పోయింది

పొలంలో విషం తాగి పడిపోయిన ప్రేమికులను క్రిష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ రోజు నుంచి ఆసుపత్రిలో ఉన్న 9వ తరగతి అమ్మాయి చికిత్స విఫలమై చనిపోవడం కలకలం రేపింది. సౌందర్ రాజన్ చికిత్స పొందుతున్నాడని, కేసు విచారణలో ఉందని పోలీసులు అన్నారు. కర్ణాటకలోని వేమగల్ లో అమ్మాయి మిస్సింగ్ కేసు, తమిళనాడులోని హోసూరులో ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న కేసు విచారణలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+