LPG పై మోదీ ప్రభుత్వం బిగ్ అప్ డేట్..? ఇకపై..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభంలో మునిగిపోయాయి. అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్య సరఫరాకు కీలకం అయిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దాంతో ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. భారత్ లోనూ పెట్రోల్, డీజిల్ తో పాటు గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే 10 రోజుల వ్యవధిలో ఏకంగా నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. అలాగే LPG గ్యాస్ సిలిండర్ సరఫరా, డెలివరీలో పలు కీలక మార్పులను చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక జూన్ 1 నుంచి ప్రభుత్వరంగ సంస్థలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను సిలిండర్ పై రూ. 42 నుంచి రూ. 53. 50 కు పెంచేసిన విషయం తెలిసిందే.

పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన భద్రత, రవాణా ఖర్చులు పెరగడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థలపై ఆ ప్రభావం పూర్తిగా పడుతోంది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం సాధారణ ప్రజలు, గృహిణులకు ఉపశమనం కలిగిస్తూ 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు చేయలేదు. దాంతో గత నెలలో ఉన్న ధరలే ఈ నెలలోనూ కొనసాగుతున్నాయి.

దిల్లీలో గృహ వినియోగ సిలిండర్ ధర ప్రస్తుతం 913 గా ఉంది. అలాగే కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3,113గా ఉంది. నోయిడాలో గృహ వినియోగ సిలిండర్ ధర రూ. 910 గా ఉంది. కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3,113గా ఉంది. ముంబైలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 912 గా ఉంది. కమర్షియల్ సిలిండర్ ధర రూ. 3,067 గా ఉంది. కోల్ కతాలో అయితే రూ. 939 గా ఉంది. కమర్షియల్ సిలిండర్ అయితే రూ. 3,255 గా ఉంది. ఇక హైదరాబాద్ లో అయితే గృహ వినియోగ సిలిండర్ ధర రూ. 965 గా ఉంది. అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 3,367 గా ఉంది.

మరోవైపు పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా గ్యాస్ కొరత రాకుండా చూసేందుకు చమురు సంస్థలను కనీసం 30 నుంచి 40 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలను అత్యవసర రిజర్వ్ గా ఉంచుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

LPG Booking Rates Changed Modi Government s Big Update What Consumers Need to Know Now LPG

ఇక ఇళ్లల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ తీసుకున్న పాత ఎల్పీజీ కస్టమర్లు, తమ గ్యాస్ కనెక్షన్ ను 30 రోజుల్లోగా సరెండర్ చేయాల్సి ఉంటుంది. వారికి ఇకపై ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ సదుపాయం ఉండదు. ఇక వలస కార్మికులు, విద్యార్థులకు ఉపయోగపడే 5 కిలోల చిన్న ఎల్పీజీ సిలిండర్ ధరను కూడా రూ. 11 మేర పెంచిన విషయం తెలిసిందే. దిల్లీలో దీని ధర ఇప్పుడు రూ. 821 కు చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+