సంచలన రిపోర్ట్:పెరిగిన నూడుల్స్ గిరాకీ, ప్యాకేజీ ఫుడ్‌కే జై

పశ్చిమాసియా ఉద్రిక్తతలు సామాన్యుడి కంచంపై పెను ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధి గుండా జరిగే ఇంధన రవాణా స్తంభించిపోవడంతో, భారత్‌లో వంటగ్యాస్ (LPG) సరఫరా అస్తవ్యస్తమైంది. ఫలితంగా గంటల తరబడి వంట చేసే సంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి, నిమిషాల్లో సిద్ధమయ్యే 'రెడీ-టు-ఈట్' (Ready-to-Eat) పదార్థాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

భారతదేశం తన వంటగ్యాస్ అవసరాల కోసం 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతినడంతో గత 15 రోజుల్లోనే దేశీయ ఎల్‌పీజీ వినియోగం గతేడాదితో పోలిస్తే 17.7 శాతం పడిపోయింది. ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఈ తగ్గుదల ఏకంగా 26.3 శాతంగా నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాలకే ప్రాధాన్యత ఇస్తుండటంతో, హోటళ్లు మరియు రెస్టారెంట్లు వాడే కమర్షియల్ సిలిండర్లపై భారీగా కోత పడింది.

LPG Crisis In India Middle East War Changes Indian Food Habits Huge Spike In Ready-To-Eat Food Demand

'హీట్ అండ్ ఈట్' వైపు మధ్యతరగతి చూపు..

హోటళ్లలో ధరలు పెరగడం, ఇంట్లో గ్యాస్ ఆదా చేసుకోవాలనే ఉద్దేశంతో మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు ప్యాకేజ్డ్ ఫుడ్‌ను ఆశ్రయిస్తున్నాయి. ముఖ్యంగా ప్యాకేజ్డ్ పులిహోర, ఉప్మా, బిర్యానీ వంటి 'హీట్ అండ్ ఈట్' ఉత్పత్తులకు గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. వీటితో పాటు ఆరోగ్యకరమైన మిల్లెట్ (చిరుధాన్యాలు) ఉత్పత్తుల కోసం కూడా వినియోగదారులు క్యూ కడుతున్నారు. ఈ మార్పు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, చిన్న పట్టణాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ-కామర్స్ దిగ్గజాల సేల్స్ హవా!

ప్రజల ఆహారపు అలవాట్లలో వస్తున్న ఈ అనూహ్య మార్పును ఈ-కామర్స్ సంస్థల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇన్‌స్టంట్‌ నూడుల్స్, ప్యాకేజ్డ్ మీల్స్, స్నాక్స్ విభాగంలో 15 శాతం పైగా వృద్ధి నమోదైందని అమెజాన్ వంటి సంస్థలు పేర్కొంటున్నాయి. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఆహార తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని వేగవంతం చేస్తున్నాయి. యుద్ధం సృష్టించిన ఈ 'ఇంధన సంక్షోభం' భారతీయ గృహిణుల వంటగది మేనేజ్‌మెంట్‌ను, ప్రజల జీవనశైలిని పూర్తిగా మార్చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+