వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా తగ్గింపు.. డొమెస్టిక్ కాదండోయ్..

|
Google Oneindia TeluguNews

కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఎల్ పీజీ గ్యాస్ ధర భారీగానే తగ్గించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 కు తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధరను సిలిండర్‌కు రూ .122 తగ్గించాయి. ఎల్‌పిజి గ్యాస్ ధర తగ్గింపు తరువాత జూన్ 1 నుంచి సవరించిన ధర సిలిండర్‌కు రూ .1473.50 చెల్లించాల్సి ఉంటుంది. అంతకుముందు ఎల్‌పిజి కమర్షియల్ సిలిండర్ ధర సిలిండర్‌కు రూ .1595.50గా ఉంది.

మే నెలలో ఎల్‌పిజి గ్యాస్ ధరను సిలిండర్‌కు రూ .45 తగ్గించాయి. ఎల్‌పిజి గ్యాస్ ధర సిటీ నుంచి సిటీకి మారుతూ ఉంటుంది. భారతదేశం అంతటా ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో చుద్దాం. పదండి. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు ఎల్‌పిజి గ్యాస్ ధర సిలిండర్‌కు రూ .1473.50గా ఉంది. జూన్ 1న ముంబైలో ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర రూ.1422.50. కోల్‌కతాలో ఎల్‌పిజి గ్యాస్ ధర సిలిండర్‌కు రూ .1544.50గా ఉంది. చెన్నైలో 19 కిలోల సిలిండర్‌కు రూ.1603గా ఉంది.

lpg gas price reduced by rs 122

మే నెలలో ఢిల్లీలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ .1595.50 కాగా, ముంబైలో సిలిండర్‌కు రూ .1545.00గా ఉంది. కోల్‌కతాలో ఎల్‌పిజి గ్యాస్ ధర మే నెలలో రూ .1667.50 కాగా, గత నెలలో రూ .1725.50గా ఉంది. ఎల్‌పిజి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు రిలీఫ్ లేదు. అంటే 14.2 కిలోల సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

English summary
lpg gas price reduced by rs 122 check price of lpg cylinder in your city here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X