Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీ 7వ జాబితా: అమరావతి నుంచి నవనీత్ కౌర్ రాణా పోటీ

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులతో బీజేపీ 7వ జాబితాను విడుదల చేసింది. మహారాష్ట్రలోని అమరావతి (ఎస్సీ) స్థానం నుంచి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన సినీనటి నవనీత్ కౌర్ రాణాను బరిలో దించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదంతో తమ పార్టీ అభ్యర్థిగా ఆమె పేరును బుధవారం రాత్రి ప్రకటించింది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో అమరావతి స్థానం నుంచి శివసేన నేత ఆనందరావు అడ్సుల్‌పై నవనీత్ రాణా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు, కర్ణాటకలోని చిత్రదుర్గ(ఎస్సీ) సీటు నుంచి కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్‌ను బరిలోకి దించింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఎ నారాయణస్వామి గెలుపొందగా.. ఈసారి అభ్యర్థిని మార్పు చేసింది.

LS elections BJP releases 7th list of candidates fields Navneet Kaur Rana from Amravati Maharashtra

హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాతో కర్నాల్ అసెంబ్లీ స్థానం ఖాళీ కావడంతో.. అక్కడ్నుంచి ప్రస్తుత సీఎం నాయబ్ సింగ్ సైనీని పోటీలో నిలిపింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 అసెంబ్లీ స్థానాలతోపాటు మరికొన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది.

కాగా, మార్చి 26న పార్టీ సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థుల ఆరో జాబితాను విడుదల చేసింది. రాజస్థాన్‌లోని దౌసా లోక్‌సభ స్థానం నుంచి కన్హయ్య లాల్ మీనా, కరౌలీ-డోల్‌పూర్ స్థానం నుంచి ఇందూ దేవిని పార్టీ బరిలోకి దించింది. కాగా, మణిపూర్ ఇన్నర్ స్థానం నుంచి తౌనోజం బసంత కుమార్ సింగ్ పోటీ చేయనున్నారు.

ఏపీలో అసెంబ్లీ అభ్యర్థుల జాబితా

అదోని - పీవీ పార్థ సారధి
ధర్మవరం - సత్యకుమార్
ఎచ్చెర్ల - ఎన్. ఈశ్వర్ రావు
విశాఖ నార్త్ - విష్ణు కుమార్ రాజు
అరకు - పంగి రాజారావు
విజయవాడ వెస్ట్ - సుజనా చౌదరి
కైకలూరు - కామినేని శ్రీనివాస్ రావు
అనపర్తి - శివ కృష్ణం రాజు
బద్వేల్ - బొజ్జా రోషన్న
జమ్మలమడుగు - ఆదినారాయణ రెడ్డి

కాగా, మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గానూ ఇప్పటి వరకు 400కుపైగా స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మార్చి 2న ప్రకటించింది. తొలి జాబితాలో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ సహా 34 మంది కేంద్ర ప్రభుత్వ మంత్రులను బీజేపీ బరిలోకి దింపింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి స్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేయనున్నారు.

మార్చి 13న పార్టీ రెండో అభ్యర్థుల జాబితా విడుదలైంది. లోక్‌సభ ఎన్నికలకు మరో 72 మంది అభ్యర్థుల పేర్లను అందులో పేర్కొంది. రెండో జాబితాలో అనురాగ్ ఠాకూర్, మనోహర్ లాల్ ఖట్టర్, పీయూష్ గోయల్, అనిల్ బలూనీలకు చోటు దక్కింది. తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను మార్చి 21న విడుదల చేశారు. బీజేపీ మూడో అభ్యర్థి జాబితా ప్రకారం.. తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై కోయంబత్తూరు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు, కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ నీలగిరి నుంచి పోటీ చేయనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+