అదృష్టం అంటే ఇతనిదే... రూ. 16 కోట్ల ప్రైజ్ మనీ పొందాడు..
భారీగా డబ్బులు సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే డబ్బులు సంపాదించేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో ఉద్యోగాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించడం అంటే సాధ్యమయ్యే పనే కాదు. అందుకే ఎంతోమంది ఇక కోట్లు సంపాదించేందుకు ఉద్యోగాల మీద ఆధారపడకుండా కొత్త దారులు వెతుకుంటున్నారు. అందులో ఒక పద్ధతి లాటరీలు.. చాలామంది రిస్క్ లేకుండా లాటరీలు కొనుగోలు చేసి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఇప్పుడా అదృష్టం తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తిని వరించింది. అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదంటారు కదా. కానీ అదృష్టం ఒక్కసారి పలకరిస్తే ఆ మనిషి దశే మారిపోతుంది.. బాల్యం నుంచి ఎన్నో కష్టాలు అనుభవించిన ఓ వ్యక్తికి ఇప్పుడు అదృష్టదేవత వరించింది. ఇప్పుడు అతని జీవితం మారిపోయింది. ఇప్పుడు అందరూ అతనిని అదృష్టం అంటే అతడిదే అని అంటున్నారు. తమిళనాడుకు చెందిన మాగేష్ కుమార్ ఎమిరేట్స్ డ్రాలో 16 కోట్ల రూపాయల జాక్‌పాట్ తగిలింది.

నెలకు 5.6 లక్షల రూపాయలు : మాగేష్ కుమార్ నటరాజన్‌ను శుక్రవారం అదృష్టదేవత వరించింది. ఎమిరేట్స్ డ్రాలో ఫాస్ట్5 గ్రాండ్ ప్రైజ్ ఈయన సొంతమైంది. ఈ జాక్‌పాట్ కొట్టిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందని మొదటి వ్యక్తిగా మాగేష్ కుమార్ నటరాజన్ నిలిచారు. ఈ బహుమతి కింద ఆయనకు నెలకు సుమారు 5.6 లక్షలు రాబోతుంది. ఇది ఇలాగే 25 ఏళ్లపాటు కొనసాగుతుంది. మాగేష్ కుమార్ నటరాజన్ 2019 నుంచి నాలుగేళ్లపాటు సౌదీ అరేబియాలో పనిచేసేందుకు వెళ్లారు. అప్పటినుంచే లాటరీలపై ఆస్తకి ఉండటంతో లాటరీలను కొనుగోలు చేయడం ప్రారంభించాడు. దాంతో ఇప్పడు భారీ బహుమతినే పొందాడు. ఎమిరేట్స్ డ్రాలో ఫాస్ట్ 5 గ్రాండ్ ప్రైజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక, ఈ డబ్బుతో ఒక 25 ఏళ్ల పాటు ఈయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.
అయితే, ప్రస్తుతం ఆయన తమిళనాడులోని అంబూరులో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. భారీ బహుమతి లభించిన తర్వాత నటరాజన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను బాల్యం నుంచి ఎన్నో కష్టాలు అనుభవించానని, ఇప్పటికీ నాకు అదృష్టం వరించిందని, ఈ వచ్చిన డబ్బుతో తన కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇవ్వడంతోపాటు, సమాజంలో అవసరమైన వారికి తన వంతు సహాకారం అందిస్తానని చెప్పారు. చదువుకునే రోజుల్లో నాకు ఎంతోమంది సహాయం చేశారు. ఇప్పుడు ఈ డబ్బుతో వారికి సహాయం చేస్తాను అని అంటున్నారు నటరాజన్..












Click it and Unblock the Notifications