ఇద్దరు మహిళలకు లిఫ్ట్ ఇచ్చి.. కదులుతున్న వాహనంలోనే గ్యాంగ్ రేప్

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ దారుణం వెలుగుచూసింది. కారులో వెళుతున్న ఓ వ్యక్తి లిఫ్ట్ ఇస్తానంటూ ఇద్దరు మహిళలను ఎక్కించుకుని, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కదులుతున్న వాహనంలోనే వారిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఆ మహిళలు ఫరూఖాబాద్ నుంచి కమల్‌గంజ్‌కు తిరిగొస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తెలిసిన వ్యక్తే కావడంతో వారు నిస్సంకోచంగా కారులో ఎక్కారు. ఆ తరువాత కొంతదూరం వెళ్లాక ఆ కారులో మరో ఇద్దరు వ్యక్తులు ఎక్కారని, అందరూ కలిసి వీరిపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారని తెలుస్తోంది.

Lucknow: 2 women gang-raped in a moving vehicle

ఈ దారుణం అనంతరం బాధిత మహిళలు ఓ దాబాకు వచ్చి తలదాచుకున్నట్లు కన్నూజ్ ఎస్పీ శేఖర్ చంద్ర గోస్వామి పేర్కొన్నారు. సదరు దాబా యజమాని ఆ మహిళలను పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత మహిళలకు కౌన్సెలింగ్ నిర్వహించి వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+