ఆమెకింకా పెళ్లి కాలేదు.. కానీ జైలుకొచ్చాక..

Subscribe to Oneindia Telugu

లక్నో : జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మహిళ ఖైదీల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది జైలు అధికారులు. మహిళలను శారీరకంగా లొంగదీసుకుని తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో జైలు శిక్ష అనుభవిస్తోన్న ఓ అవివాహిత గర్భవతి అని తేలడంతో, అక్కడి జైలు అధికారి భాగోతం బట్టబయలైంది.

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జైల్లో జరిగిన ఈ ఘటన తాలుకు వివరాలను పరిశీలిస్తే.. ఆస్తి తగాదాలకు సంబంధించిన ఓ హత్య కేసులో ఒక కుటంబమంతా జైళ్లోనే శిక్ష అనుభవిస్తోంది. తల్లి, తండ్రితో పాటు ఇద్దరు కూతుళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. తండ్రి ఇటీవలే బెయిల్ మీద విడుదలవగా, తల్లీ కూతుళ్లు శిక్ష అనుభవిస్తున్నారు. ఇద్దరు కూతుళ్లలో ఒకరైన 21 ఏళ్ల అవివాహితను జైలు అధికారి ఒకరు శారీరకంగా వేధించినట్టు తెలుస్తోంది. దీంతో సదరు అవివాహిత జైలు అధికారి మూలంగా గర్భం దాల్చింది.

 Lucknow: In jail for murder since November, 21 yr-old found 34 weeks pregnant

విషయం తెలిసిన ఉన్నతాధికారులు సదరు జైలు అధికారిని సస్పెండ్ చేశారు. గర్బవతిగా ఉన్న ఆ యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Jail and the district administration of jaunpur on sunday ordered seperate probes after the medial report of a 21 year old unmarried girl, lodged in the district jail on murder harges stated she was 34weeks pregnant.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి