రాజకీయాల్లోకి సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఎంట్రీ: ప్రధాని మోదీ సీట్ నుంచే- పక్కా ప్లాన్ !!

సీబీఐ మాజీ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న వారణాసి వేదికగా ఆయన సర్వజన సనాతన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఐపీఎస్ అధికారిగా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన ఆయన ఇప్పుడు ప్రజల సమస్యల పరిష్కారం కోసం రంగంలోకి దిగారు. దీనికి వారణాశిని కేంద్రంగా ఎంచుకున్నారు.

పరిపాలనా పరమైన సంస్కరణల ద్వారానే దేశ సమగ్ర పునర్నిర్మాణం సాధ్యం కాదని నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. దేశాన్ని ఆధునిక ప్రగతి పథంలో నడిపిస్తూనే ప్రాచీన నాగరికత మూలాలతో దాన్ని అనుసంధానించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సనాతన ధర్మం అనేది ఓ పూజా విధానమో, మతాచారమో కాదని అన్నారు. అది.. సత్యం, ధర్మం, కరుణ, సమ న్యాయం, ప్రజా సంక్షేమంతో కూడిన ఒక ఉన్నతమైన జీవన విధానమని స్పష్టం చేశారు.

M Nageshwar Rao Former CBI Director Takes Charge as Sarvajana Sanatan Party President in Varanasi

దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సర్వజన సనాతన పార్టీ ప్రధానంగా నాలుగు విలువలపై దృష్టి సారిస్తుందని నాగేశ్వరరావు స్పష్టం చేశారు. విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, సాంస్కృతిక పునరుద్ధరణ అనే అంశాలను పార్టీ నాలుగు ముఖ్య స్తంభాలుగా ఉంటాయని పేర్కొన్నారు. విద్యా విధానంలో భారతీయ ప్రాచీన విజ్ఞానాన్ని, చరిత్రను ఆధునిక ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించారు. నవ సమాజ నిర్మాణానికి ఈ సమతుల్యమైన విద్యా విధానమే శ్రీరామరక్షగా అభివర్ణించారు.

భారత్ పై షై హోప్ శివతాండవం
భారత్ పై షై హోప్ శివతాండవం

ఆధునిక వైద్య విధానాలతో పాటు భారతీయ సంప్రదాయ వైద్య చికిత్సలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని నాగేశ్వరరావు తెలిపారు. యువత, రైతులు, చేతివృత్తుల వారు, దేశీయ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాలు, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం తమ మూడో ప్రాధాన్యతగా వివరించారు. సాంస్కృతిక పునరుద్ధరణ కింద దేశీయ భాషలు, కళలు, పండుగలు, కుటుంబ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.

రాత్రికి రాత్రి తిప్పి కొట్టిన కేంద్రం: భారత్ లోని పాకిస్తాన్ రాయబారికి సమన్లు సైతం..
రాత్రికి రాత్రి తిప్పి కొట్టిన కేంద్రం: భారత్ లోని పాకిస్తాన్ రాయబారికి సమన్లు సైతం..

దేవాలయాలను పూజా స్థలాలుగానే కాకుండా సామాజిక పురోగతికి తోడ్పడే సజీవ సంస్థలుగా తీర్చిదిద్దడానికి తమ వంతు ప్రయత్నాలు సాగిస్తామని నాగేశ్వరరావు తెలిపారు. దేవాలయాల నిర్వహణలో పారదర్శకత, భక్తుల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని, టెక్నాలజీ పురోగతిని సాధిస్తూనే సాంస్కృతిక మూలాలను గౌరవించడం ద్వారానే ఆధునిక భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు.

వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు
వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు

సర్వజన సనాతన పార్టీ ప్రారంభ కార్యక్రమానికి పలువురు పార్టీ ప్రముఖులు హాజరయ్యారు. ఎస్‌ఎస్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడు మహంత్ తీర్థానంద్, రీతూ రాథోడ్, ప్రధాన కార్యదర్శి రాజా సక్షం సింగ్ యోగి, అధికార ప్రతినిధి బబితా శర్మ, ఉత్తరప్రదేశ్ ఇన్‌చార్జ్ రాకేశ్ తివారీ, సంస్థాగత వ్యవహారాల మంత్రి నరనారాయణ్ సింగ్ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+