వాటి పేరుతో ఓట్లు అడుగు : ప్రియాంకగాంధీపై ఉమాభారతి సెటైర్లు
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకొంది. అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా యూపీని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు క్యాంపెయిన్ కొనసాగుతోంది. యూపీలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ దూసుకుపోతుండగా .. ఆమె వ్యాఖ్యలను బీజేపీ నేతలు తిప్పికొడుతూ ఎన్నికల సమరాన్ని పీక్ స్టేజీకి తీసుకొచ్చారు.

ప్రియాంక వర్సెస్ ఉమా
'నిన్న గంగా నదీ గుండా ఎన్నికల ప్రచారం చేపట్టిన యువనేత ప్రియాకం హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే వివిధ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అలాగే పేదరికం గురించి కూడా ప్రస్తావించారు. కానీ వాటి మధ్యే పేదరికం ఉందనే విషయాన్ని మాత్రం ప్రియాంక మరిచారని' విమర్శించారు కేంద్రమంత్రి ఉమాభారతి. సోమవారం నాటి పర్యటనలో గంగా, రామ్, హనుమాన్, పేదరికం గురించి ప్రియాంక గాంధీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కానీ ఇవే అంశాలు దేశ సమస్యగా మారాయని ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. కానీ ఈ అంశాలు మన విశ్వాసం .. కానీ ఓటు బ్యాంకు కాదని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి ఉమాభారతి రియాక్టయ్యారు.

విశ్వాసం, దేశభక్తిని ప్రస్తావించు ..
ఇటీవల ఉమాభారతి, ప్రియాంకగాంధీ మధ్య చౌకిదార్ అంశంపై కూడా మాటల యుద్ధం జరిగింది. 'విశ్వాసం, దేశభక్తితో మనం జీవిస్తున్నాం, కానీ ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ వీటికి తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ అంశాలపై మాట్లాడి తనదైన శైలిలో ఓట్లు అడగాలని' కోరారు ఉమాభారతి.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications