వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధు కిష్వార్ సెక్స్ ట్వీట్ : యువకులకు ఉచిత సెక్స్ హామీ రాహుల్ ఇస్తారు..విమర్శలపాలైన మేధావి

|
Google Oneindia TeluguNews

సోషల్ మీడియా వచ్చాక ఎవరూ తమ అభిప్రాయాలను తమలో దాచుకోవడం లేదు. ఏది అనిపిస్తే అది నిర్భయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. సాధారణ వ్యక్తి నుంచి వీఐపీలు సెలబ్రిటీలు వరకు అంతా తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగానే పంచుకుంటున్నారు. తాజాగా ప్రముఖ సామాజిక కార్యకర్త , మేధావి మధు కిష్వార్ కూడా ఆమె అభిప్రాయాన్ని ట్విటర్‌లో పోస్టు చేసి విమర్శల పాలయ్యారు. ఇంతకీ ఆమె చేసిన ట్విటర్ పోస్టు ఏమిటో తెలుసా..?

వివాదాస్పద ట్విటర్ పోస్టు చేసి మధుకిష్వార్

వివాదాస్పద ట్విటర్ పోస్టు చేసి మధుకిష్వార్

ఈ మధ్య కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తను పర్యటించిన చోట్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి పనులు చేస్తుందో అక్కడి ప్రజలకు వివరిస్తూ వస్తున్నారు. ఈ మధ్యే రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలందరికీ కనీస వేతనం ఇస్తామంటూ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సామాజిక కార్యకర్త, మేధావి మధు కిష్వార్ తెలిసో తెలియకో ఓ పోస్టు ట్విటర్‌లో పెట్టారు.

ఓ ట్వీట్‌కు సమాధానంగా సెక్స్ ట్వీట్ చేసిన మధు కిష్వార్

ఓ ట్వీట్‌కు సమాధానంగా సెక్స్ ట్వీట్ చేసిన మధు కిష్వార్

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదప్రజలకు బియ్యం, గోధుమలు ఉచితంగా ఇస్తామని రాహుల్ గాంధీ హామీలు ఇస్తే ఎలా ఉంటుందని కొందరు ట్విటర్‌లో పోస్టు చేశారు. దీనికి మధుకిష్వార్ రిప్లై ఇచ్చారు. బియ్యం, గోధుమలతో పాటు కనీస అవసరాల జాబితాలో వచ్చే సెక్స్ పై కూడా హామీ ఇవ్వాలన్నారు. యువకులకు ఉచితంగా సెక్స్ అందించే కార్యక్రమం రాహుల్ గాంధీ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన రావడం మధు కిష్వార్ వెంటనే ట్విటర్‌లో పోస్టు చేయడం చకచకా జరిగిపోయాయి.

యువకులకు ఉచితంగా సెక్స్ చేసుకునే హామీ రాహుల్ ఇస్తారు

"కొన్ని రోజులు ఓపిక పట్టండి. యువకులకు ఏడాదికి ఇన్ని రోజులు ఉచితంగా సెక్స్ అంటూ రాహుల్ గాంధీ హామీ ఇస్తారు"అంటూ ట్వీట్ చేశారు మధు కిష్వార్. ట్విటర్‌లో ఇలాంటి పోస్టు పెట్టగానే నెటిజెన్లు మధు కిష్వార్‌ను ఓ ఆట ఆడుకున్నారు. సమాజంలో ఓ బాధ్యతగల మహిళగా ఉన్న మీరు ఇలాంటి పోస్టులు పెట్టడం సరికాదన్నారు. నిజంగా నమ్మలేకున్నామని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. మరికొందరు మీరు ఎప్పుడైనా సెక్స్‌లో పాల్గొని అందుకు డబ్బులు చెల్లించారా అంటూ ప్రశ్నించారు. ఇందుకు మరో వ్యక్తి సమాధానంగా ఆమె సెక్స్‌లో పాల్గన్నప్పుడల్లా డబ్బులు చెల్లించేది కావొచ్చు అంటూ ట్వీట్ చేశారు.

నా గర్ల్ ఫ్రెండ్ సెక్స్‌కు డబ్బులు తీసుకోదు

మరో వ్యక్తి ఓ అడుగు ముందుకేసి ఇలా అన్నాడు."మేడం సెక్స్ అనేది ఉచితంగానే ఉంటుంది. కానీ నా గర్ల్‌ఫ్రెండ్ మాత్రం డబ్బులు తీసుకోదు. షాపింగ్‌కు తీసుకెళ్లి ఏమైనా కొనివ్వమంటుంది. నా గర్ల్‌ఫ్రెండ్‌తో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు నేనేమీ డబ్బులు చెల్లించను. మీ భర్తతో సెక్స్‌లో పాల్గొని మీరు డబ్బులు అడుగుతారా " అంటూ మరో నెటిజెన్ ప్రశ్నించారు.

రాహుల్‌కు ఇలాంటి ఐడియా ఇస్తే జీవితాంతం ఆయనే ప్రధాని

మరో వ్యక్తి యువకులు రాహుల్ గాంధీతో లైంగికంగా కలవాలని ఎవరూ అనుకోరు. ఒకవేళ ఈ హామీ ఇచ్చినా వర్కౌట్ కాదని ఓ వ్యక్తి ట్వీట్ చేయగా... మరో వ్యక్తి మాత్రం ఇలాంటి ఐడియాలు రాహుల్ గాంధీకి ఇవ్వొదు. ఎందుకంటే ఉచిత సెక్స్ హామీ ఇస్తే ఎప్పటికీ ప్రధానిగా రాహుల్ గాందీనే ఉంటారు. ఇది మోడీకి ఆగ్రహం తెప్పించే విషయం అవుతుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

English summary
It is not easy being on Twitter these days. The plausible what-if scenarios get tested to the limits and how.Now, Madhu Kishwar, a noted scholar and activist, is no exception to imagining "what might/could have been."In reply to an opinion in form of a tweet, she posted, "Wait till Rahul Gandhi also promises free sex for every adult male for a certain number of days every year!"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X