ఛత్తీస్‌గఢ్,మధ్యప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో పోలింగ్ షురూ.. బరిలో ఎవరెవరంటే..!
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లల్లో పోలింగ్ ప్రక్రియ ఆరంభమైంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. అధికార పార్టీని ఎన్నుకుంటోన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండోదశ, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఈ పోలింగ్ పూర్తవుతుంది.
ఈ రెండు రాష్ట్రాలతో పాటు తెలంగాణ, రాజస్థాన్‌లల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ నెల 30వ తేదీన ఒకే విడతలో పోలింగ్ ముగియనుంది. మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడత పోలింగ్ ఇదివరకే ముగిసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఈ రెండు రాష్ట్రాల్లో ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ఆరంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటోన్నారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్‌ను నిర్వహించారు. ఎక్కడా సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.
మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో 70 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తొలిదశలో 20 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. అవన్నీ కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉండటమే దీనికి కారణం.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున భద్రత బలగాలను మోహరించారు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. పారా మిలటరీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్రీయ రిజర్వ్ పోలీస్ దళాలను రంగంలోకి దించారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు.

230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో పోలింగ్ ముగుస్తుంది. 5.59 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వారిలో 2.87 కోట్ల మంది పురుషులు, 2.71 కోట్ల మంది మహిళలు, 1,292 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. వారికోసం 64 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను నెలకొల్పారు అధికారులు. ఇందులో 12,032 పోలింగ్ సెంటర్లను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు భూపేష్ బఘేల్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఎన్నికల బరిలో ఉన్నారు. పాటన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా భూపేష్ బఘేల్, బుధ్ని నుంచి బీజేపీ తరఫున శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీలో నిలిచారు. కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్.. ఛింద్వారాలో పోటీ చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ, మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నాయి. ఆయా పార్టీలు తమ అధికారాన్ని నిలబెట్టుకుంటాయా? లేదా? అనేది డిసైడ్ చేసే ఎన్నికలు ఇవి. ఈ రెండింటి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఫలితాలు డిసెంబర్ 3వ తేదీన వెలువడనున్నాయి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications