అమ్మాయిలను సులభంగా ట్రాప్ చేయొచ్చు: బిజెపి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంచిగా మాట్లాడితే అమ్మాయిలు పడిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. నిర్ణీత వయస్సులోనే అమ్మాయిలకు వివాహలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తాను బాల్య వివాహలను ప్రోత్సహించనని చెబుతూనే ఆ వివాహలకు మద్దతుగా పరోక్షంగా మాట్లాడారనే విమర్శలు విన్పిస్తున్నాయి.
మంచిగా మాట్లాడితే అమ్మాయిలు కొత్త వాళ్ళతోనైనా ఇట్టే పడిపోతారని ఆయన చెప్పారు. ఈ తరహ ఘటనలు దేశంలో పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మాయిలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అగర్‌మాల్వా నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే గోపాల్ పర్మర్ శనివారం పాల్గొన్నారు.

మన ప్రభుత్వాలు అమ్మాయిలకు వివాహర్హత వయసును 18 ఏళ్లుగా నిర్ణయించాయి. కానీ, ఇప్పుడు అదే కొంప ముంచుతోంది. తియ్యటి మాటలకు మన అమ్మాయిలు సులువుగా వలలో పడిపోతారని చెప్పారు. . లవ్ జిహాదీ ఉదంతాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి, తల్లులు వారిని ఓ కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది. లవ్ జిహాద్ నుంచి దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉందని ఆయన మాట్లాడారు.
తనకు 12 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. అలాగని బాల్య వివాహాలను నేను ప్రొత్సహించను. 18 ఏళ్లలోపే అమ్మాయిలకు పెళ్లిళ్లు కుదిర్చండి. అప్పుడు వాళ్లకు ఎలాంటి తప్పుడు ఆలోచనలు రావన్నదే నా అభిప్రాయమని పర్మర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై . శనివారం సాయంత్రం కొంత మంది విద్యార్థులు భోపాల్ హైవే పై ధర్నా చేపట్టారు. పర్మర్ క్షమాపణలు చెప్పాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications