ముఖ్యమంత్రి పాటకు మంత్రుల డ్యాన్స్.. వీడియో వైరల్
Madhya Pradesh: మన సంస్కృతి ఎన్నో పండుగలను జరుపుకునే అవకాశాన్ని ఇస్తుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అన్నారు. ఈ పండుగలు ప్రజల మధ్య ప్రేమాభిమానాలను పెంచుతాయన్నారు. మధ్యప్రదేశ్‌లో హోలీ సందర్భంగా అసెంబ్లీ సెక్రటేరియట్,సాంస్కృతిక శాఖ సంయుక్తంగా అసెంబ్లీలోని మానసరోవర్ ఆడిటోరియంలో గురువారం ఫాగ్ మహోత్సవాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హోలీ పాటలు పాడగా.. అక్కడున్న మంత్రులు అందుకు తగ్గట్లుగా డ్యాన్సులు వేశారు. ముఖ్యమంత్రి కూడా పూలతో హోలీ ఆడుతూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఫాగ్ మహోత్సవం సందర్భంగా సీఎం మోహన్ యాదవ్ ప్రతి ఒక్కరిపై పూల వర్షం కురిపించడం ద్వారా ప్రేమ, సామరస్యం సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అదే సమయంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పాటలు పాటి అందరినీ ఉత్సాహపరిచారు. ఆ పాటలకు అక్కడున్న మంత్రులు దానికి తగ్గట్లు డ్యాన్సులు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎం ఎక్స్ వేదికగా పంచుకోగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిరోజ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఉమాకాంత్ శర్మ ముఖ్యమంత్రి చేయి పట్టుకుని ఆయనతో కలిసి నృత్యం చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా జోరుగా నృత్యం చేశారు. మంత్రి విజయవర్గీయతో కలిసి సీఎం మోహన్ యాదవ్ కూడా గోవింద ఆలా రే పాటను పాడారు.

ఫాగ్ మహోత్సవం కార్యక్రమంలో స్పీకర్ నరేంద్ర సింగ్ తోమర్, ప్రతిపక్ష నాయకుడు ఉమాంగ్ సింఘర్, ఉప ముఖ్యమంత్రి జగదీష్ దేవ్డా, ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర కుమార్ శుక్లా, మంత్రులు కైలాష్ విజయవర్గియా, ప్రహ్లాద్ పటేల్, ఉదయ్ ప్రతాప్ సింగ్, సంపతియ ఉయ్కే, ఎడాల్ సింగ్ కంషనతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు, శాసనసభ ప్రధాన కార్యదర్శి ఎ.పి. సింగ్, ఇతర అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు.
फाग के रंग, भजन के संग...
— Dr Mohan Yadav (@DrMohanYadav51) March 20, 2025
फाग उत्सव कार्यक्रम में विधानसभा के साथियों संग प्रेम, सौहार्द और उल्लास के रंगों में रंगते हुए सभी को होली की हार्दिक शुभकामनाएं दीं। pic.twitter.com/x1quYRMhAi












Click it and Unblock the Notifications