వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నైట్ కర్ఫ్యూ: మధ్యప్రదేశ్‌లో నేటి నుంచి అమలు.. రాత్రి 11 తర్వాత నాట్ అలొ‌డ్

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ భయపెడుతుంది. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టంచేసింది. దీంతో మధ్యప్రదేశ్ వేగంగా స్పందించింది. ఇవాళ రాత్రి నుంచి రాత్రి కర్ఫ్యూ స్టార్ట్ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ష్యూ అమల్లో ఉంటుంది. తదుపరి ఆదేశాలు అమలు చేసే వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది.

కేసులు వచ్చిన ప్రాంతాన్ని కంటైన్మైంట్ జోనుగా పరిగణించాలని స్పష్టంచేసింది. అలాగే ఆక్సిజన్ బెడ్లు ఎక్కువగా సమకూర్చాలని.. 40 శాతం వరకు ఉండాలని పేర్కొంది. ఇక మధ్యప్రదేశ్‌లో ఒమిక్రాన్ కేసులు 14 ఉన్నాయి. గత నెలలో 3300 మంది విదేశీయులు దిగారు. వీరిలో 2100 మందిని పరీక్షించారు. 14 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది.

madhya pradesh imposes night curfew from today

ఒమిక్రాన్ కేసులు హడలెత్తిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 70 పై చిలుకు దేశాలకు పాకింది. ఎగుమతి, దిగుమతి ముఖ్యం అయినందున విమాన రాకపోకలకు అనుమతించారు. దీంతో కొత్త వేరియంట్ పాకింది. ఇటు వైరస్ కూడా ప్రాణపాయం లేదని నిపుణులు చెబుతున్నారు. కానీ రీ ఇన్ ఫెక్షన్ అవుతుందనే షాకింగ్ నిజాన్ని తెలియజేస్తున్నారు. 90 రోజుల తర్వాత వైరస్ మళ్లీ వస్తుందనే కఠోర నిజాన్ని వివరించారు.

వేరియంట్ కూడా రకరకాలుగా పరివర్తనం చెందుతుంది. రోజుకో కొత్త విషయాన్ని వారు చెబుతున్నారు. దీంతో ప్రజలు మరింత భయపడాల్సి వస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రెండేళ్లలో సమ్మర్‌లో వైరస్ వేగంగా ప్రభావం చూపించింది. ఇక ఈ సారి చలికాలంతో భయపెడుతుంది.

English summary
Omicron effect:madhya pradesh imposes night curfew from today. curfew imposed night 11pm to morning 5am.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X