మధ్యప్రదేశ్ నిర్ణయం: రేప్ చేస్తే మరణ శిక్షనే...
అత్యాచారాలను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరుగుతుండడంతోప్రభుత్వం కఠిన నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలో మహిళలకు కనీస భద్రత కరువ
Recommended Video

భోపాల్: అత్యాచారాలను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరుగుతుండడంతోప్రభుత్వం కఠిన నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలో మహిళలకు కనీస భద్రత కరువైందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
దాంతోప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే దోషులకు మరణ శిక్ష విధించాలన్న తీర్మానానికి ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహిళలపై సామూహిక అత్యాచారం చేసే నిందితులకు కూడా మరణ శిక్ష విధించేందుకు పచ్చజెండా ఊపింది.
అత్యాచారం రుజువైన పక్షంలో నిందితులకు విధించే శిక్ష, జరిమానా మొత్తాన్ని పెంచేందుకు సైతం శిక్షా స్మృతిని సవరించేందుకు కూడా అంగీకారం తెలిపింది.మహిళలపై అత్యాచారయత్నం చేసినా, వెంటపడి వేధించినా రూ.లక్ష జరిమానా విధించాలని నిర్ణయించింది.

ఇందుకు సంబంధించి ఈ శీతాకాల సమావేశాల్లో శాసనసభలో బిల్లు ప్రతిపాదిస్తామని ఆర్థిక మంత్రి జయంత్ తెలిపారు. రాష్ట్రంలో బాలికలపై అఘాయిత్యాలను నియంత్రించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఎన్‌సీఆర్‌బీ రికార్డుల ప్రకారం దేశంలో అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications